ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

 ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటుగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

ఢిల్లీ విమానాశ్రయంతో పాటుగా నగరంలోని దాదాపు 20 ఆసుపత్రులకు   బెదిరింపు ఈమెయిల్స్ వచ్చింది.  ఇందులో  దీప్ చంద్ బంధు హాస్పిటల్, GTB హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్ లాంటివి ఉన్నాయి.  దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.  బెదిరింపు మెయిల్ రావడంతో ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులలో భద్రతను పెంచారు. విమానాశ్రయంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అయితే ఇప్పటివరకు ఏ ప్రాంతం నుంచి కూడా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కాగా ఢిల్లీ ప్రాంతానికి వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం కలవర పెడుతోంది. మే 1న,ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని దాదాపు 130 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్స్ లోని అందరు విద్యార్థులను ఇంటికి పంపించారు.