ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడు

ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడు

భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద $ 137.4 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి రికార్డు సృష్టించారు. చైనాకు చెందిన జాక్ మా, భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ కూడా ఈ స్థానాలకు ఎప్పుడూ చేరుకోలేదు. ఇక మూడో స్థానంలో అదానీ ఉండగా.. మొదటి రెండు స్థానాల్లో టెస్లా మోటర్స్ సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.

ప్రసిద్ధ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ ఎల్‌విఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన అదానీ సంపద $ 137.4 బిలియన్ల డాలర్లతో దూసుకుపోతున్నారు. ఇక మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ నికర సంపద 251 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో నిలిచిన జెఫ్ బెజోస్ నికర విలువ 153 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానానికి పడిపోయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 1.37 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ ఈ జాబితాలో టాప్ 10లో ఉన్నారు. అతని సంపద 91.9 బిలియన్ డాలర్లు.