జర్మన్ బూట్ల కంపెనీ చైనా టు ఇండియా

జర్మన్ బూట్ల కంపెనీ చైనా టు ఇండియా

న్యూఢిల్లీ: జర్మన్ ఫుట్‌‌వేర్ బ్రాండ్ వోన్ వెల్‌‌ఎక్స్‌‌ ఓనర్ కాస ఎవర్జ్‌‌ తన షూ ప్రొడక్షన్‌‌ను చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నట్టు ప్రకటించింది. తొలుత రూ.110 కోట్ల పెట్టుబడితో ఈ తరలింపు చేపడతామని కంపెనీ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ యూనిట్ ద్వారా కంపెనీ ఏడాదికి 30 లక్షల పెయిర్స్‌‌ ఫుట్‌‌వేర్‌‌‌‌ ప్రొడక్షన్ చేపడుతోంది. కంపెనీ లైసెన్సీ లాట్రిక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ కోలాబరేషన్‌‌తో ఉత్తరప్రదేశ్‌‌లో కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పలుమార్లు చర్చల అనంతరం, కాస ఎవర్జ్  తన పూర్తి షూ ప్రొడక్షన్‌‌ను చైనా నుంచి ఇండియాకు తరలించాలని నిర్ణయించిందని లాట్రిక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సీఈవో ఆశీష్ జైన్ తెలిపారు. చైనాలో కాసకు 2 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. లాట్రిక్ ఇండస్ట్రీస్‌‌ ఇప్పటికే ఇండియాలో 5 లక్షల పెయిర్స్ వోన్ వెల్‌‌ఎక్స్‌‌ జర్మనీ షూలను రూపొందిస్తోంది. కొత్త యూనిట్ ఏర్పాటుతో మరో 30 లక్షల పెయిర్స్‌‌ ఉత్పత్తిని ఇక్కడే చేపట్టనుంది. యూపీ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రొడక్షన్‌‌ను వచ్చే రెండేళ్లలో  చేరుకోనున్నామని జైన్ చెప్పారు. ఫేజ్‌‌ 1లో భాగంగా రూ.110 కోట్లు ఖర్చు పెట్టనున్నామని, ఫేజ్‌‌ 2లో భాగంగా దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ ఉత్పత్తిని ఇక్కడే చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫుట్‌‌వేర్‌‌‌‌కు అవసరమైన స్పెషల్ ఫ్యాబ్రిక్స్, అవుట్‌‌సోల్స్, కెమికల్స్‌‌ వంటి రా మెటీరియల్స్‌‌ ఇండియాలో అందుబాటులో లేవని పేర్కొన్నారు. రామెటీరియల్స్‌‌ను, ఫుట్‌‌వేర్ దిగుమతులను తగ్గించుకుని, ఇండియాలో తయారు చేసే ఫుట్‌‌వేర్‌‌‌‌ క్వాలిటీని పెంచుతామని జైన్ చెప్పారు. అయితే కాస ఎవర్జ్ ప్రొడక్షన్‌‌ను చైనా నుంచి ఇండియాకు తరలించడంపై స్పందించిన జైన్.. ఫుట్‌‌వేర్‌‌ ఇండస్ట్రీ‌‌ ప్రపంచంలో లేబర్ ఎక్కువగా అవసరమయ్యే ఇండస్ట్రీస్‌‌లో ఒకటి. లేబర్ అందుబాటు అనేది ఆ కంపెనీకి లాభదాయకంగా నిలవనుంది.  తమ మొత్తం ప్లాన్ సక్సెస్ అయ్యేందుకు యూపీ గవర్న్‌‌మెంట్‌‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

మాన్యుఫాక్చరింగ్ పవర్‌‌‌‌హౌస్‌‌గా ఇండియా…

ప్రపంచంలో ఇండియా మాన్యుఫాక్చరింగ్ పవర్‌‌‌‌హౌస్‌‌గా నిలువనుందని జైన్ విశ్వాసం వ్యక్తం  చేశారు. ప్రపంచవ్యాప్తంగా కాసకు 12 లైసెన్సీలు ఉంటే, 18 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లున్నాయి. దీని ప్రొడక్ట్స్‌‌ 80 దేశాల్లో అమ్ముడుపోతున్నాయి. కాగా, కరోనా వైరస్ అనంతరం, చైనా నుంచి ఇండియాకు పలు కంపెనీలు తమ ప్రొడక్షన్ యూనిట్లను తరలించాలని చూస్తున్నాయి. చాలా కంపెనీలు చైనా మీదే ఎక్కువగా ఆధారపడటంతో, కరోనా వైరస్ కారణంతో వారికి గ్లోబల్‌‌గా సప్లయి చెయిన్‌‌లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కంపెనీలు ఇప్పుడు ఇండియావైపుకి చూస్తున్నాయి.