అథ్లెటిక్స్ లాంగ్ జంప్‭లో ఎఫ్ఆర్ఓ కూతురికి గోల్డ్ మెడల్

అథ్లెటిక్స్ లాంగ్ జంప్‭లో ఎఫ్ఆర్ఓ కూతురికి గోల్డ్ మెడల్

సుజాతనగర్, వెలుగు :  ఇటీవల గొత్తికోయల దాడిలో చనిపోయిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ లాంగ్ జంప్​లో బంగారు పతకాన్ని సాధించింది. హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్టేడియంలో 5, 6 తేదీల్లో జరిగిన రాష్ట్ర సబ్ జానియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. 10 ఏండ్ల విభాగంలో నిర్వహించిన లాంగ్ జంప్ పోటీల్లో ప్రతిభ చూపి గోల్డ్ మెడల్​సాధించిందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కె.మహిధర్ తెలిపారు.

అలాగే కొత్తగూడెంకు చెందిన వేదశ్రీ షాట్ ఫుట్ లో గోల్డ్ ,100 మీటర్ల పరుగుపందెం లో సిల్వర్ , పాల్వంచకు చెందిన బి.లోకేష్ 100 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్, భద్రాచలంకు చెందిన ఎస్‌కే.అమ్రీన్ కు షాట్ పుట్ లో కాంస్య పతకం సాధించారు. జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీకే మనోహర్ రావు..కృతిక కోచ్ మల్లికార్జున్ ను ప్రత్యేకంగా అభినందించారు.