10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్

10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్

తెలంగాణకు మాన్ సూన్ పై గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో మే 16వ తేదీ గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని హెచ్చరించారు IMD  అధికారులు. 

హైదరాబాద్ సహా పలు జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.  ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే చాన్సుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 36 నుంచి 40 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు.

అకాల వర్షాలతో నిజమాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. మే చివరి వారంలో వర్షాలు తగ్గుముఖంపట్టి, ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదుర గాలులతో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.