తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన

న్యూ ఇయర్ సందర్భంగా గురువారం (జనవరి 01) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. మంత్రి రాకతో దగ్గరుండి ప్రత్యేక దర్శనం చేయించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. దేవస్థానంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన వివిధ సౌకర్యాలను గురించి మంత్రికి వివరించారు.

దర్శనం అనంతరం దేశంలోనే తొలిసారిగా టీటీడీ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు మంత్రి. ఏపి సీఎం చంద్రబాబు ఆదేశాలతో అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రత్యేక దృష్టి సారించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక AI టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన ICCC రియల్ టైమ్ లో మంచి ఫలితాలు ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు ఈవో. 

తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ CV&SO మురళీకృష్ణ ICCC పని తీరును మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో సెంటర్ కీలక పాత్ర పోషించడం చాలా సంతోషమన్నారు.