- మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీలోని 66 డివిజన్లలో ముసాయిదా ఓటర్ జాబితాను పక్కాగా రెడీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ఆఫీస్‌లో మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ ప్రకారం ఓటర్ల డేటాను పొందుపరచాలన్నారు.
అంతకుముందు అమరవీరుల స్తూపం సమీపంలో ఐడీఎస్ఎంటీ బిల్డింగ్ ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, టౌన్ ప్లానింగ్ డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, ఈఈ సంజీవ్ కుమార్, ఏఈ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
