కోతులను తప్పించుకోబోయి.. మహిళ మృతి.. కరీంనగర్ జిల్లాలో ఘటన

కోతులను తప్పించుకోబోయి.. మహిళ మృతి.. కరీంనగర్ జిల్లాలో ఘటన

శంకరపట్నం, వెలుగు : కోతుల గుంపు బెదిరించడంతో వాటి నుంచి తప్పించుకోబోయి కింద పడి మహిళ చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కేశిరెడ్డి విమల (50) బుధవారం ఇంటి ముందు పని చేసుకుంటోంది. ఇదే సమయంలో కోతుల గుంపు అక్కడికి రావడంతో వాటిని తరిమేందుకు ప్రయత్నించింది. దీంతో కోతుల గుంపు మహిళను బెదిరించడంతో వెనుకకు వెళ్లే ప్రయత్నంలో కింద పడింది. కుటుంబసభ్యులు హుజురాబాద్‌ హాస్పిటల్‌కు తరలించగా చనిపోయినట్లు నిర్ధారించారు.