గల్ఫ్ కార్మికుల కోసం కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఎంపీ అర్వింద్

గల్ఫ్ కార్మికుల కోసం కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఎంపీ అర్వింద్

కోరుట్ల,వెలుగు: గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యుద్దం పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ సూచించారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారు జంబిగద్దె ఏరియాలో జవహార్​ నవోదయ విద్యాలయం బిల్డింగ్​ నిర్మించేందుకు ప్రతిపాదిత స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. స్థలానికి సంబంధించిన మ్యాపును​ పరిశీలించారు. కోరుట్ల పట్టణ శివారులో సర్వే నంబర్​ 923లో 23 ఎకరాల్లో అన్ని వసతులతో నవోదయ గురుకులాన్ని నిర్మించనున్నట్లు ఎంపీ వివరించారు. 

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఆఫీస్​లో హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గల్ఫ్​ కార్మికులు, ఎన్​ఆర్​ఐల ఎంబసీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే  కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్​ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం అయ్యప్పగుట్ట వద్ద తాత్కాలికంగా నిర్వహిస్తున్న జవహార్​ నవోదయ గురుకులంలో ఏర్పాటు చేసిన సైన్స్​ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిలకించారు. ప్రథమ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఈవో రాము, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంగారెడ్డి, తహసీల్ధార్​ కృష్ణచైతన్య, ప్రిన్సిపాల్​ బ్రహ్మనందరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ​