కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో నడుచుకుంటూ వెళ్లుతున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ రోడ్డు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న నాలాలో పడిపోయింది. కొద్దిసేపటికి వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు ఆమెను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
కొన్నేండ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండగా సమీపంలోని రోడ్లు గుంతలుగా మారాయి. మురుగు కాలువలు రిపేర్లు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంతో అటువైపు రాకపోకలు సాగించేవారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
