పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అప్డేట్ వచ్చింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో పవన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు 2023 నుంచి వినిపిస్తూనే ఉంది. ఇక ఎట్టకేలకు 2026 కొత్త సంవత్సరం సందర్భంగా, ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన అనౌన్స్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా (జనవరి 1న) ఈ విషయాన్ని ప్రకటిస్తూ, రామ్ తాళ్లూరి X వేదికగా పోస్ట్ పెట్టారు.
" జైత్రరామమూవీస్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెం.1గా నా కలకు నాంది పడుతోంది. మన ప్రియతమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) గారి ప్రేమ, ఆశీస్సులతో ఈ బ్యానర్‌కు నామకరణం జరగడం ఎంతో గర్వంగా ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీలతో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను. వీరికి ఎప్పటికీ కృతజ్ఞుడను. ఈ కలల ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది" అని నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అప్డేట్ ఇచ్చారు.
With folded hands and a full heart 🙏
— Ram Talluri (@itsRamTalluri) January 1, 2026
My dream begins as Production No.1 under #JaithraRamaMovies 🎥
Named with Love & Blessings by our beloved Power Star (PSPK) ❤️
Teaming up with Surender Reddy & Vakkantham Vamsi
Forever grateful. Forever proud.
This dream project is…
సురేందర్ రెడ్డి-పవన్ కళ్యాణ్ మూవీ కథ!
హైదరాబాద్ మాఫియా బ్యాక్‌డ్రాప్లో రానున్న ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ అండర్ వరల్డ్ డాన్గా, పోలీస్ అధికారిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సంచారం. అంతేకాదు ఈ సినిమాలో పవన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందట. మునుపెన్నడూ కనపడని సరికొత్త అవతారంలో, సరికొత్త బాడీ లాంగ్వేజ్తో ఆడియన్స్ను అలరించనున్నారట పవన్ కళ్యాణ్.
►ALSO READ | Sara Tendulkar: గోవా గల్లీలో సారా టెండూల్కర్.. చేతిలో బీర్ బాటిల్తో వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ లేదా అనిరుధ్.. వీరిద్దరిలో ఒకరు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇకపోతే, ఈ సినిమాకు "ఒకడే ఇద్దరు కదా" అనే ఇంట్రెసింగ్ టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
సురేందర్ రెడ్డి ఏజెంట్:
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి 2023లో అఖిల్ తో తెరకెక్కించిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఏజెంట్ ప్లాప్ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ దర్శకుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎఫెక్ట్ తో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఇన్నాళ్లు భయపడుతూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వడంతో క్యూరియాసిటీ నెలకొంది.
Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021
