జ్యోతిష్యం : 2026లో డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, ఉద్యోగంలో ఎవరి బాగుంటుంది.. ఎవరికి చెడుగా ఉంటుంది..!

జ్యోతిష్యం : 2026లో డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, ఉద్యోగంలో ఎవరి బాగుంటుంది.. ఎవరికి చెడుగా ఉంటుంది..!

కొత్త సంవత్సరం 2026  ప్రారంభమైంది.  జ్యోతిష్యం ప్రకారం అనేక గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటారు.  వీటి ప్రభావం  12 రాశుల వారి వ్యక్తిగత జీవితంలో కెరీర్​.. ఆర్థిక.. ఆరోగ్య విషయాల్లో చాలా మార్పులు సంభవిస్తాయి.  ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఏఏ విషయాల్లో మార్పు ఉంటుందో తెలుసుకుందాం. .  . 

జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ ఏడాది (2026) మేషం, వృషభం, సింహ, వృశ్చిక రాశుల వారికి కెరీర్​ విషయంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.  మిథునం, కర్కాటకం, కన్యా రాశుల వారికి ఉద్యోగ విషయంలో బాగా అభివృద్ది ఉంటుంది. ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు ఈ ఏడాదిలో ఆశించిన జాబ్​ వస్తుంది.  ఇక  ధనుస్సు, మకరం, కుంభం , మీన రాశుల వారికి, ఈ ఏడాదిలో  ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. 

ఆర్థిక విషయాల్లో..

ఈ ఏడాది( 2026)  ప్రారంభం గురుడు మిథునరాశిలో తిరోగమనంలో ఉంటాడు.  దీని ప్రభావంతో 
మేషం, వృషభం, మిథున, కర్కాటకం,  కన్య రాశుల వారు కొత్త  పెట్టుబడులు ..  ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక శని తిరోగమన గమనంలో ఉన్న సమయంలో .. వృశ్చికం,   ధనుస్సు రాశుల వారికి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి.  అప్పుడప్పుడు నగదు ప్రవాహంలో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు. కర్కాటకం, సింహ, తుల రాశుల వారు బలమైన  ఆర్థిక స్థితిని  కలిగి ఉంటారు.

ఆరోగ్యం ఎలా ఉంటుంది..

మేషం, వృషభం ,  కుంభ రాశుల వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలలో సమతుల్యత ..  క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  సింహ,  తుల రాశి వారికి  బృహస్పతి తిరోగమనం కారణంగా మానసిక అశాంతి ఏర్పడటం.. అనవసర ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది.  మిథునం,  వృశ్చిక రాశుల వారికి  ఆరోగ్య పరంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి.. . ధనుస్సు మీనం రాశి వారు ఈ ఏడాది ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు అంటున్నారు. 

ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు

ప్రస్తుతం యూత్​కు ప్రేమ.. పెళ్లి పెద్ద టాస్ట్​గా మారింది.  జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది (2026) గురుబలం అనుకూలంగాఉన్నవారికి ప్రేమ వ్యవహారాలుబలపడుతాయి.  ఈ ఏడాది గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.  గృహ జీవితంలో భార్యభర్తల మధ్య సామరస్యం పెరుగుతుంది. మేషం, వృషభం, సింహ , కన్య రాశుల వారికి ప్రేమ కలలు సాకారమవుతాయి,  కర్కాటకం, తుల, వృశ్చికం , మకర రాశుల వారికి కుటుంబ సంబంధాలు  పెరుగుతాయి.  ఈ రాశులవారు పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఉన్నత కుటుంబంతో సంబంధం నిశ్చయమవుతుంది.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.