హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బాంబ్ పేలుస్తానంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన.. రాష్ట్రంలో సారా దుకాణాలను మళ్లీ తెరవాలని ప్రభుత్వాన్ని తాను కోరతానని వెల్లడించారు.
గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల పాటు బతికే వారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు చాలా మంది మద్యం తాగి 80 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అందుకే తెలంగాణలో సారా దుకాణాలను తిరిగి ప్రారంభించాలని తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు. సారా ఆరోగ్యానికి హానికరం కాదని శాస్త్రీయ పద్ధతులు చెబుతున్నాయని అన్నారు.
