మంత్రిని విమర్శిస్తే సహించేది లేదు : కాంగ్రెస్ లీడర్లు

మంత్రిని విమర్శిస్తే సహించేది లేదు : కాంగ్రెస్ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబును విమర్శిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌‌‌‌ను కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. మంథని, రామగిరి, కమాన్‌‌పూర్‌‌‌‌, ముత్తారం మండలాల కాంగ్రెస్ లీడర్లు బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు, వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పుట్ట మధుకు రాజకీయ భిక్ష పెట్టింది దుద్దిళ్ల కుటుంబమేనన్నారు. అలాంటి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలో జరుగుతున్న  అభివృద్ధిని ఓర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీనియర్​నాయకులు తొట్ల తిరుపతియాదవ్, ఆయిలి ప్రసాద్, దొడ్డ బాలాజీ,  శశిభూషణ్ కాచే, సదానందం, వెంకన్న, శ్రీనివాస్,  భాస్కరరావు, వెంకటరమణారెడ్డి, రాజయ్య, రమ పాల్గొన్నారు.