నాల్కోలో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వారికి ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

నాల్కోలో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వారికి ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో)  గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల  అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 22. 

ఖాళీలు: 110 (గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ). 
విభాగాల వారీగా వివరాలు: మెకానికల్ 59, ఎలక్ట్రికల్ 27, కెమికల్ 24. 
ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డు నుంచి సంబంధిత రంగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో పూర్తికాల రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55  శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్) గేట్​– 2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 02. 
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. 
లాస్ట్ డేట్: జనవరి 22. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.nalcoindia.com వెబ్ సైట్ ను సందర్శించండి.