ఢిల్లీ: ఏఐ వాడితేనే ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామంటోంది ప్రముఖ గ్లోబల్ టెకీ సంస్థ యాక్సెంచర్. సీనియర్ స్థాయి ఉద్యోగులు పనిలో ఏఐ టూలస్ను క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడే లీడర్షిప్ హోదాలకు అర్హత ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజ ర్లకు ఈమెయిల్ పంపినట్లు సమాచారం. ఏఐ వినియోగం లేకపోతే ప్రమోషన్లలో వెనుకబడే పరిస్థితి ఉంటుందన్న సంకేతాన్నికంపెనీ ఇచ్చి నట్లు పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఢిల్లీలో జరిగిన ఇండియా.. ఏఐ ఇంపాక్ట్ సమ్మి ట్లో అకెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడు తూ, కంపెనీలు గత కొన్ని దశాబ్దాలుగా కొస సాగుతున్నపని విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రక్రియలు, ఉద్యోగుల నైపుణ్యాలను ఏఐకి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు తప్పనిసరిగా పెట్టాలని చెప్పారు. ఇదే సమయంలో ఏఐకి అనుగుణంగా పున:శిక్షణ ఇవ్వలేమని భావించిన 11 వేల మంది ఉద్యోగులను యాక్సెంచర్ ఇప్పటికే తొలగించింది. మూడు సంవత్సరాల్లో సెవరెన్స్ ప్యాకేజీలపై సంస్థ భారీగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. యాక్సెంచర్ మాత్రమే కాకుండా ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ పంటి కంపెనీలు కూడా ఉద్యోగుల ఏఐ వినియోగంపై దృష్టి పెడుతున్నాయి. ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచి, ఉద్యోగుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ఐటీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
