మత్తు వదిలి మైదానాల్లోకి రావాలి..ఆటలు టైం పాస్ కు ఆడొద్దు : మంత్రి వాకిటి

మత్తు వదిలి మైదానాల్లోకి రావాలి..ఆటలు టైం పాస్ కు ఆడొద్దు : మంత్రి వాకిటి

క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్లాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  గచ్చిబౌలి స్టేడియంలో  సెకండ్  ఎడిషన్ సీఎం కప్ పోటీలను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారని..అందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారని చెప్పారు.  క్రమశిక్షణ లేని క్రీడాకారులు పై స్థాయి వరకు వెళ్ళరు..క్రమశిక్షణ ఉన్న క్రీడాకారులే జాతీయ స్థాయి వరకు వెళ్తారని చెప్పారు.  మీలో నైపుణ్యంను  వెలికితీసి రాష్ట్రానికి కప్  తీసుకురావాలన్నారు.  అరుదైన అవకాశం  ప్రభుత్వం ఇస్తుందన్నారు. మత్తు వదిలి మైదానాలకు రావాలి.. ఆటలు టైం పాస్ గా ఆడొద్దని అన్నారు వాకిటి.  సీఎం కప్  సెకండ్ ఎడిషన్  పోటీల నిర్వహణలో మంచి విజయాలు సాధించాలన్నారు. మన దేశం, రాష్ట్రం కోసం ఆడితే మీ కాళ్ళ దగ్గరికే కప్ లు వస్తాయని చెప్పారు మంత్రి వాకిటి.

సీఎం కప్ ద్వారా జాతీయ ,అంతర్జాతీయ  స్థాయిలో కూడా క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి.  క్రమశిక్షణ నైపుణ్యంతో గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి,రాష్ట స్థాయి పోటీలకు క్రీడాకారులు వచ్చారని చెప్పారు. భారతదేశంలో ఎక్కువ గోల్డ్ కప్ లు సాధించట్లేదు..కాబట్టి రానున్న ఒలంపిక్ లో గోల్డ్ కప్ మన రాష్టం నుంచి సాధించాలన్నారు. క్రీడాకారుల కోసం బడ్జెట్ లో ఎంతైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పోర్ట్స్ ఇండియాలో లేని సదుపాయాలు తెలంగాణ రాష్ట్రంలో  తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్ట మొదటి కేబినెట్ లో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు.  ఆరు అకాడమీలు ఉన్న  తెలంగాణలో 12 అకాడమీలు చేశామని చెప్పారు. తెలంగాణ కోచ్ ల కర్మాగారంగా తయారు కాబోతుందన్నారు శివసేన రెడ్డి.