సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు..మరోసారి చార్జిషీట్ రిటర్న్

సంధ్య థియేటర్  తొక్కిసలాట కేసు..మరోసారి చార్జిషీట్ రిటర్న్

హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ను నాంపల్లి కోర్టు మరోసారి రిటర్న్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు ఇదే కేసులో చార్ట్ను కోర్టు వెనక్కి పంపిన విషయం తెలిసిందే. పోలీసులు సమర్పించిన చార్ట్ను పరిశీలించిన కోర్టు, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సరైన విధంగా పొందుపరచలేదని పేర్కొంది. ముఖ్యంగా హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటి ఎవిడెన్స్ మెటీరియల్ ను చార్జ్ షీట్ కు  జతపరచలేదని కోర్టు పేర్కొంది. దీంతో చార్జ్ షీట్  రిటర్న్ చేస్తూ లోపాలను సరిదిద్దాలని ఆదేశించింది. 

ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సహా మొత్తం 23 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే సమర్పించిన పత్రాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు సాక్ష్యాల విషయంలోనూ తగిన బలముందా? అనే అంశంపై కోర్టు సందేహం వ్యక్తం చేసింది.