Prabhas: "నాకూ ప్రేమలో పడాలని ఉంది".. పెళ్లిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Prabhas: "నాకూ ప్రేమలో పడాలని ఉంది".. పెళ్లిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతోంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , యంగ్ హీరో సంతోష్ శోభన్ టీమ్ మధ్య జరిగిన సరదా చిట్ చాట్. యువీ క్రియేషన్స్ నిర్మించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్‌ను ప్రభాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో తన పెళ్లి, ప్రేమపై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నాకూ ప్రేమలో పడాలని ఉంది!

ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "మీ దృష్టిలో ప్రేమంటే ఏంటి?" అని అడగ్గా.. ప్రభాస్ తనదైన శైలిలో నవ్వుతూ, "ఇది పర్సనల్ క్వశ్చన్ కదా" అంటూ దాటవేశారు. అయితే ఆ వెంటనే, ప్రస్తుతానికి 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మాటే గుర్తొస్తోంది. కానీ, ఈ సినిమా చూశాక నాకూ ప్రేమలో పడాలని అనిపిస్తోంది అని మనసులో మాట బయటపెట్టారు. 46 ఏళ్లు వచ్చినా, ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ నోటి నుండి ఈ మాట రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "డార్లింగ్.. ఇక పెళ్లి ముహూర్తం పెట్టేయడమే ఆలస్యం" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కురిపిస్తున్నారు.

చెన్నై టు ముంబై.. ఫ్లైట్‌లో బిర్యానీ!

ఈ చిట్ చాట్‌లో ప్రభాస్ తన ఫుడ్ లవ్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. 'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో దర్శకుడు ఓం రౌత్ కోసం ఒక స్పెషల్ 'చీట్ మీల్' ప్లాన్ చేశారట.  ముంబైలో షూటింగ్ జరుగుతుంటే, చెన్నై ఫ్లేవర్ మిస్ అవ్వకూడదని ప్రభాస్ ఏకంగా చెన్నై నుండి ఒక వ్యక్తితో ఫ్లైట్‌లో ఆహారాన్ని తెప్పించారని చెప్పారు. ఆ ఫుడ్ తిన్న ఓం రౌత్, నీలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అని ఆశ్చర్యపోయారట. మన హైదరాబాద్ బిర్యానీ గొప్పదే అయినా, చెన్నై ఫ్లేవర్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని ప్రభాస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంతోష్‌కు ఫోన్ నంబర్.. స్వీట్ వార్నింగ్!

ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన 'వర్షం' సినిమా డైరెక్టర్ శోభన్ కుమారుడే ఈ సంతోష్ శోభన్. ఆ అనుబంధంతో ప్రభాస్ సంతోష్‌ను ఎంతో ఆదరిస్తారు. అన్నా.. నీ నంబర్ నా దగ్గర లేదు అని సంతోష్ అడగ్గా, ప్రభాస్ వెంటనే తన పర్సనల్ నంబర్ ఇచ్చారు. అయితే ఇస్తూనే, ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చెయ్.. అనవసరంగా చేస్తే తంతా! అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు.

'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ఫిబ్రవరి 14న విడుదలై యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ సినిమాను ప్రమోట్ చేయడం, అందులోనూ తన పెళ్లిపై పాజిటివ్ గా స్పందించడం సినిమా సక్సెస్‌ను మరింత పెంచింది. మరి మన డార్లింగ్ ప్రేమలో పడి, త్వరలోనే ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాలి!