డిగ్రీ, పీజీ అర్హతతో HLL లైఫ్ కేర్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ చేసినోళ్లకు మంచి ఛాన్స్

డిగ్రీ, పీజీ అర్హతతో HLL లైఫ్ కేర్‌లో ఉద్యోగాలు..  ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ చేసినోళ్లకు మంచి ఛాన్స్

హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హతగల అభ్యర్థులు ఆన్  లైన్  ద్వారా అప్లయ్  చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మార్చి 10.

ఖాళీలు: 40 (మేనేజ్మెంట్ ట్రైనీ),

విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీరింగ్ 17, ఫార్మా 06, మార్కెటింగ్ 10, హ్యుమన్ రిసోర్సెస్ 2, సోషల్ వర్క్ 1, హాస్పిటల్ మేనేజ్మెంట్ 3.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్., బి.ఫార్మా, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీడీబీఎం, ఎంఐబీ, ఎంపీఐబీ, పీజీడీపీఎం, ఎంహెచ్ఎర్ఎం. బీఎస్సీ, ఎంబీఏ (హాస్పిటల్ మేనేజ్ మెంట్ ) పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్ లైన్  ద్వారా,

 అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 18.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య ర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: మార్చి 10.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ అసెస్మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పూర్తి వివరాలకు lifecarehll.com వెబ్ సైట్  సందర్శించండి.