న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా హాలీడే ట్రిప్ కు వెళ్లారు. బార్ లో మందేస్తూ.. చిందేస్తూ జాలీగా గడుపుతున్నారు. అప్పుడప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ బ్రో.. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్ అంటూ ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ఆ సంతోషం ఎక్కువ సేపు మిగలకుండానే.. ఆనందంగా గడుపుతూనే పలువురు అనంత లోకాలకు వెళ్లిన ఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది. బార్ లో భారీ పేలుడు కారణంగా పలువురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా క్రాన్స్ మంతనలోని అల్పైన్ లక్జరీ రిసార్ట్ లో ఉన్న లె కాన్‌స్టలేషన్ బార్ లో పేలుడు సంభవించింది. గురువారం (జనవరి 01) తెల్లవారుజామున జరిగిన పేలుడులో పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. బార్ లో ఉన్న ఫర్నిచర్ చెల్లాచెదురైపోయింది. కొందరి డెబ్ డాడీలు ఎగిరి దూరంగా పడినట్లు ఘటన స్థలంలో ఉన్న సాక్ష్యులు తెలిపారు.
బార్ లో ఊహించని రీతిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొందరు గాయపడగా.. మరికొందరు చనిపోయారని సౌత్ వెస్ట్రన్ స్విట్జర్లాండ్ వల్లిస్ కంటన్ కు చెందిన పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కంస్టెల్లేషన్ బార్ లో ఈ పేలుడు సంభవించింది. టూరిస్టులకు పాపులర్ అయిన ఈ బార్ లో బ్లాస్ట్ జరగడంతో స్విట్జర్లాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతులలో ఎక్కువగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. హాలీడే ట్రిప్ లో భాగంగా క్రాన్ మొంతన వచ్చిన టూరిస్టులు.. కొత్త సంవత్సరం వేడుకల్లో మృతి చెందడం చాలా విషాదరకం అని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న స్కై రిసార్ట్ లో పేలుడు సంభవించడంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
