దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ల ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదికల ప్రకారం, భారతదేశంలో అత్యధిక ఆస్తులు ప్రకటించిన ఐదుగురు సీఎంలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. వీరిలో మొదటి స్థానంలోకర్నాటక కొత్త సీఎం డీకే శివకుమార్ ఉండగా రెండో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి తొలిసారి సీఎం అయిన జోసెఫ్ విజయ్ ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, నాగాలాండ్ సీఎం నెపుయూ రియో దేశంలోనే టాప్ 5 ధనవంతుల లిస్టులో చోటు దక్కించుకున్నారు.
డీకే శివకుమార్ రూ. 1,413 కోట్లు
కర్ణాటక కొత్త సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ అక్షరాల రూ. 1,413 కోట్లు.
చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సుమారు రూ. 931 కోట్ల నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన మిగతా నేతలకు భిన్నంగా, టెక్నాలజీపై ఎక్కువ ఆసక్తి ఉన్న టీడీపీ నాయకుడిగా అపారమైన సంపదలో అధిక భాగం ఆయన కుటుంబానికి చెందిన భారీ వ్యాపార సంస్థల నుండే సమకూరిందని ప్రకటించారు.
సి జోసెఫ్ విజయ్ రూ. 648 కోట్లు
తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ రూ. 648 కోట్ల విలువైన ఆస్తులతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. నటుడిగా తన అత్యంత లాభదాయకమైన కెరీర్ ద్వారా సంపాదించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే, విజయ్ తన భారీ బాక్సాఫీస్ వసూళ్లను వ్యక్తిగత సంపదగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
పెమా ఖండూ రూ.332 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, రూ.332 కోట్ల ఆస్తులను ప్రకటించి అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు.
నీఫియు రియో రూ. 49.95 కోట్లు
నాగాలాండ్ సీఎం నీఫియు రియో మొత్తం నికర ఆస్తి విలువ సుమారుగా రూ. 46.95 కోట్లు. అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల మొదటి ఐదుగురి జాబితాలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన తాజా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఈ NDPPనేత వ్యక్తిగత సంపద, దేశంలోని అత్యంత సంపన్న అత్యంత ధనవంతులైన సీఎం లిస్టులో నిలిపింది.
