PEDDI Box Office: ‘పెద్ది’ ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్గా ప్రకటించిన మేకర్స్..

PEDDI Box Office: ‘పెద్ది’ ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్గా ప్రకటించిన మేకర్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.135.36 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు వెల్లడించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దాదాపు 8.2 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యి పెద్ది సత్తా చాటుకుంది.

నెట్ కలెక్షన్స్:

ట్రేడ్ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం, జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి చరణ్ కెరియర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ అందుకుంది. ఇండియా వైడ్గా తొలి రోజు రూ.51 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో గ్రాస్ పరంగా  రూ.82.49 కోట్లకి పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 12,412 షోలలో ప్రదర్శించబడిన ఈ చిత్రం మొత్తం 45.5 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని దూకుడు కనబరుస్తోంది.

ప్రీమియర్స్ వసూళ్లు:

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్దికి, ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచే మంచి కలెక్షన్స్ వచ్చాయి. బుధవారం జూన్ 3న రాత్రి 8 గంటలకు పడిన స్పెషల్ ప్రీమియర్ల ద్వారా ఇండియాలో రూ.18.50 కోట్ల నెట్ వసూళ్లు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్..

తెలుగు వెర్షన్ ‘పెద్ది’ సక్సెస్ కి ప్రధాన బలంగా నిలిచింది. మొత్తం 6,944 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా 68 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. సాధారణంగా బుధ, గురు రెండు రోజులు వర్కింగ్ డేస్ కావడంతో కొన్ని కలెక్షన్స్ మిస్ అయినట్లు ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ, ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక హిందీ మార్కెట్‌లో ఓపెనింగ్ సాధారణంగానే ఉన్నప్పటికీ, వీకెండ్‌లో పాజిటివ్ టాక్‌తో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇతర భాషల్లో కలెక్షన్స్..

హిందీ: రూ.3 కోట్లు (4,333 షోలు, 16% ఆక్యుపెన్సీ)
తమిళం: రూ.0.45 కోట్లు (701 షోలు, 22% ఆక్యుపెన్సీ)
కన్నడ: రూ.0.25 కోట్లు (210 షోలు, 22% ఆక్యుపెన్సీ)
మలయాళం: రూ.0.10 కోట్లు (220 షోలు, 16% ఆక్యుపెన్సీ)

‘గేమ్ ఛేంజర్’తో పోలిస్తే..

రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఇండియాలో తొలి రోజు రూ.51 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.80.09 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ, అది 17,753 షోలలో విడుదలైంది. ‘పెద్ది’ మాత్రం తక్కువ షోలతోనే అదే స్థాయి నెట్ కలెక్షన్స్ సాధించడం విశేషం. ‘పెద్ది’ రూ.135 కోట్ల గ్రాస్ సాధించి భారీ ఆధిక్యాన్ని చూపించింది. 

హిందీలో డిస్సపాయింట్..

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ సాధించిన ‘పెద్ది’కి హిందీ మార్కెట్ నుంచి మాత్రం ఆశించిన స్థాయి స్పందన లభించలేదు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో తొలి రోజు కేవలం 15 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసి, ర కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

రామ్ చరణ్‌కు నార్త్ లో మంచి గుర్తింపు ఉండటం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, అవి ఓపెనింగ్ కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే వీకెండ్‌లో పాజిటివ్ టాక్, మౌత్ టాక్ పబ్లిసిటీ ప్రభావంతో హిందీ మార్కెట్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి వీకెండ్‌పై..

తొలి రోజు అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పెద్ది’కి అసలు పరీక్ష ఇప్పుడు వీకెండ్‌లోనే. శని, ఆదివారాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, సినిమా మరింత భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ బాక్సాఫీస్ ప్రయాణం బలంగా ప్రారంభమైందనే చెప్పాలి.