ఆధ్యాత్మికం: గడియారం సనాతన ధర్మానికి ప్రతిక.. 12 గంటల్లోని విశిష్టత ఇదే..!

ఆధ్యాత్మికం:  గడియారం సనాతన ధర్మానికి ప్రతిక.. 12 గంటల్లోని విశిష్టత ఇదే..!

సనాతన ధర్మం అంటే ఏమిటి.. పురాణాలు.. ఇతిహాసాల్లో ధర్మం గురించి గురించి ఏముంది.. మానవ జీవితానికి కాలచక్రానికి( గడియారానికి) సంబంధం ఏమిటి.. గడియారంలో  12 గంటలు మాత్రమే ఎందుకుంటాయి.  గడియారానికి.. సృష్టికి సంబంధం ఏమిటి.. వాచ్​ లోని 12 గంటలను సనాతన ధర్మం  ఎలా సూచిస్తుంది  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

ప్రస్తుతం హైటెక్​ యుగంలో శాస్త్రవేత్తలు ఏది కొత్తగా కనుగొన్నా.. అది పురాణాలకు .. ఇతిహాసాలకు దగ్గర సంబంధం ఉంటుంది.  అలాగే గడియారం 12 గంటలను సూచిస్తుంది.  ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం .. ఈ 12 గంటలు.. ఒక్కో గంటకు ఉండే ప్రత్యేకతను సనాతనధర్మంలో రుషులు వివరించారు. 

సనాతన ధర్మం (హిందూ ధర్మం) ప్రకారం, గడియారం కేవలం సమయాన్ని చూపే సాధనం మాత్రమే కాదని  మానవ జీవిత చక్రం ..  సృష్టి తత్వానికి ప్రతీక అని రుషులు చెబుతున్నారు.ఈ సనాతన ధర్మంలో సమయం, గడియారం ..  వాస్తు నియమాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలున్నాయని పండితులు చెబుతున్నారు.  వైదిక కాలమానం  ప్రకారం వేద గడియారంల  సనాతన ధర్మ తత్వాలతో పాటు  విశ్వ నిర్మాణాన్ని సూచిస్తుంది. గడియారంలోనొ  సమయ సూచికలు మన పురాణాలు, వేదాలు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి.

సాధరణంగా టాప్​లో మధ్యలో 12 గంటలను గడియారం సూచిస్తుంది.  సాధారణంగా 12 గంటలను మిట్ట మధ్యాహ్నం కాని.. అర్థ రాత్రిని కాని సూచిస్తాయి.  పగలయినా.. రాత్రి అయినా  ఆ సమయం నుంచే సూర్యుడి కదలికలు ప్రారంభమవుతాయి. అందుకే 12:00 గంటల స్థానాన్ని ఆదిత్య స్థానం అంటారు. దీని అర్థం సూర్యుడు 12 రూపాల్లో ఉంటారు. ఆ 12 ఆదిత్యులు 12 మాసాలకు ప్రతీకలు.. అంటే తెలుగు పంచాంగం ప్రకారం ఒక్కో మాసాన్ని తెలుపుతుంది.  అందుకే వేద గడియారంలో 12 దగ్గర ఆదిత్య అని రాసి ఉంది. 

  •  ధాటృ (చైత్ర మాసం)
  •  మిత్రుడు (వైశాఖ మాసం)
  •  అర్యమా (జ్యేష్ఠ మాసం)
  •  శక్ర (ఆషాఢ మాసం)
  •  వరుణ (శ్రావణ మాసం)
  •  అంశుమాన్ (భాద్రపద మాసం)
  •  భగ (ఆశ్వయుజ మాసం)
  •  వివస్వాన్ (కార్తీక మాసం)
  •  పూష (మార్గశిర మాసం)
  •  సవితృ (పుష్య మాసం)
  •  త్వష్ట (మాఘ మాసం)
  •  విష్ణువు (ఫాల్గుణ మాసం)

1:00 గంటల స్థానంలో ఈశ్వరుడు అని రాసి ఉంది. దీని అర్థం ఈశ్వరుడు ఒకే రకం ఉంటాడు. ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి
2:00 గంటల స్థానంలో పక్షం అని రాసి ఉంది. దీని తాత్పర్యం నెలలో రెండు  పక్షాలు రెండు ఉంటాయి: 1. మొదటి 15 రోజులు శుక్లపక్షం. 2.  చివరి 15 రోజులు  కృష్ణపక్షం
3:00 గంటల స్థానంలో  అనాది తత్వం అని రాసి ఉంది. దీని తాత్పర్యం అనాది తత్వాలు మూడు ఉన్నాయి. 1. పరమాత్మ2. జీవాత్మ, 3. ప్రకృతి ఇవి మూడు తత్వాలు అనాది అని పురాణాల ద్వారా తెలుస్తుంది.
4:00 గంటల స్థానంలో వేదం  అని రాసి ఉంది. మనకు నాలుగు వేదాలున్నాయి. 

  • ఋగ్వేదం: ఇది దేవతల పూజల వివరాలను సూచిస్తుంది. ఇందులో వ్రతాల వివరాలు.. దేవతా రహస్యాలను వివరించారు
  • యజుర్వేదం:  ఇది మానవుల దైనందిన కార్యకలాపాలు.. మానవులు యఙ్ఞాలు.. యాగాలు ఎలా నిర్వహించాలి. ఎలాంటి పూజలు చేయాలి.. ఎందుకు చేయాలి..మొదలగు వాటిని సూచిస్తుంది.  సామవేదం :ఇందులో   సంగీతం.. డ్యాన్స్​.. కళలను ఎలా ఆరాధించాలి అనే విషయాలను పేర్కొన్నారు
  • అథర్వవేదం:  ఇందులో తాంత్రిక శక్తుల గురించి వివరించారు.  

 5:00 – మహాభూతాలు (పంచభూతాలు):  ఈ విశ్వం 5 మూలభూతాలతో నిర్మితమైంది. అగ్ని,  జలం, భూమి, వాయువు, ఆకాశం

 6:00 – దర్శనాలు (షడ్దర్శనాలు): హిందూ తత్వశాస్త్రంలోని 6 ప్రధాన దర్శనాలు:

  • న్యాయ
  • వైశేషిక
  • సాంఖ్య
  • యోగ
  • మీమాంస
  • వేదాంత

 7:00 – ధాతువులు (సప్త ధాతువులు) మన శరీరాన్ని నిర్మించే 7 ధాతువులు:

  • రసం
  • రక్తం
  • మాంసం
  • మెదడు (మజ్జ)
  • ఎముకలు (అస్థి)
  • మెదస్సు/కొవ్వు (మెద)
  • శుక్రం

 8:00 – అష్టాంగ యోగం: యోగశాస్త్రంలోని 8 అంగాలు:

  • యమ
  • నియమ
  • ఆసనం
  • ప్రాణాయామం
  • ప్రత్యాహారం
  • ధారణ
  • ధ్యానం
  • సమాధి

 9:00 – అంకాలు (సంఖ్యలు)1 నుంచి 9 వరకు సంఖ్యలు – సృష్టి యొక్క గణితాధారం.
 10:00 – దిశలు10 దిశలు:

  • తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం
  • ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్య
  • పై (ఆకాశం), కింది (పాతాళం)

 11:00 – ఉపనిషత్తులు:  ముఖ్యంగా 11 ప్రధాన ఉపనిషత్తులు (వేదాంత జ్ఞానం యొక్క మూలాలు)

ఈ గడియారం కేవలం సమయం చూపించడానికి కాదు.  సనాతన ధర్మంలోని విశ్వ నిర్మాణం, తత్వం, జీవన విధానం మొత్తం ఒకే చక్రంలో చూపిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.