అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్.. మంటల సెగకు మెట్రో పిల్లర్‌కు క్రాక్‌ !

అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్.. మంటల సెగకు మెట్రో పిల్లర్‌కు క్రాక్‌ !

హైదరాబాద్: అమీర్పేట్లో అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్కి అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉండటంతో మెట్రో పిల్లర్ నాణ్యతను స్ట్రక్చరల్ ఇంజనీర్లు చెక్ చేస్తున్నారు. మెట్రో పిల్లర్కి క్రాక్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లర్ నెంబర్ 1043కి కూడా మంటల సెగ తగిలింది. దీంతో.. ప్రత్యేక డివైజ్లతో నిపుణులు నాణ్యతను చెక్ చేస్తున్నారు. అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 14 షాప్లు దగ్ధమయ్యాయి.

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న KSR ఫ్యాషన్స్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. హర్ష మెస్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా మైత్రీవనం, అమీర్ పేట్ మెయిన్ రోడ్ దగ్గర దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.

అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్లో మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రమాదంలో దగ్ధమైన మొబైల్ షాప్ ఓనర్ మాట్లాడుతూ.. మొబైల్ షాప్ మొత్తం ఖాళీ పోయిందని, దాదాపు 30 వేల రూపాయలు క్యాష్ కౌంటర్లోనే ఉన్నాయని వాపోయాడు. లక్షల్లో మాల్ ఉందని.. మొబైల్ పౌచ్లు, మొబైల్ ఎక్విప్మెంట్లు, రెండు ల్యాప్టాప్స్ కాలిపోయాయని చెప్పాడు. కొంతమంది షాప్ తెరిచి వెళ్ళారని, చాలా షెటర్లలో కంప్యూటర్లు, డాక్యుమెంట్స్ బూడిద అయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.