హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పార్టీలో మందు తాగి, బిర్యానీ తిన్న 17 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీళ్లలో ఒకరి ప్రాణం పోయింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో న్యూ ఇయర్ సందర్భంగా గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు చేసుకున్నారు.
మద్యం తాగి, బిర్యానీ తిన్న తర్వాత కొంతసేపటికి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) అనే వృద్ధుడు మృతి చెందాడు. 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. బిర్యానీ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సాయంత్రం నుంచి కేకుల కోసం జనాలు బేకరీల బాట పట్టారు. ఇయర్ ఎండ్ నేపథ్యంలో చాలా బేకరీలు కిలో కేక్‌ను రూ. 200కు ఆఫర్ ప్రకటించడంతో ఎగబడ్డారు. చాలా చోట్ల బేకరీల ఎదుట రోడ్ల పక్కనే వందల కేకులను పెట్టి విక్రయించడం కనిపించింది. అలాగే, రాత్రి బిర్యానీ సెంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్ని చోట్ల గిగ్‌వర్కర్ల సమ్మెతో బిర్యానీ సెంటర్ల ఓనర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యామ్నాయంగా తమ సిబ్బందికి డెలివరీ బాధ్యతలు అప్పగించారు.
చాలా చోట్ల వైన్ షాపుల వద్ద క్యూ లైన్లు కనిపించాయి. ఫ్రిజ్లలో పెట్టిన బీర్లు పెట్టినట్టు ఖాళీ కావడంతో చాలాచోట్ల డ్రమ్ముల్లో ఐస్వేసి అందులో బీర్బాటిల్స్పెట్టి అమ్మారు. కొన్నిచోట్ల మందు కోసం ఎగబడడంతో రోడ్లపై ట్రాఫిక్జామ్స్తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేఎల్ బార్ అండ్రెస్టారెంట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైపు వెళ్లే మెయిన్‌రోడ్డు మొత్తం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
* కుత్బుల్లాపూర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కారణంగా ఓ కాలనీలో విషాదం
* జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్ అసోసియేషన్ ఆఫీస్లో అదే కాలనీకి చెందిన 17 మంది డిసెంబర్ 31న రాత్రి మందు, విందు పార్టీ
* అర్ధ రాత్రి తాగి, డ్యాన్సులు చేస్తూ రాత్రి 1 గంట సమయంలో ఆ అసోసియేషన్ సభ్యులే వండుకున్న చికెన్, బిర్యానీలు తిని తీవ్ర అస్వస్థత
* వండుకున్న చికెన్ చేదుగా మారిందని తెలియక తాగిన మైకంలో చికెన్ తినగా.. కాసేపట్లోనే తీవ్ర కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరుగుతున్నట్లు అయి కుప్పకూలారు
* అందులో పాండు(58) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందగా, మిగిలిన 16 మందిని సూరారంలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కు తరలించి చికిత్స
* పాండు(58) మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు..
* ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులు
