చైనీస్ గ్రాండ్ ప్రి విన్నర్ ఆంటోనెలి

చైనీస్ గ్రాండ్ ప్రి విన్నర్ ఆంటోనెలి

షాంఘై: మెర్సిడెస్ యంగ్  డ్రైవర్ కిమీ ఆంటోనెలి ఫార్ములా వన్ లో చరిత్ర సృష్టించాడు. షాంఘైలో ఆదివారం జరిగిన చైనీస్‌‌‌‌ గ్రాండ్ ప్రి రేస్ ఫైనల్లో 19 ఏండ్ల ఆంటోనెలి  విజేతగా నిలిచాడు. దాంతో ఎఫ్‌‌‌‌1 చరిత్రలో ఓ రేసు గెలిచిన సెకండ్ యంగెస్ట్ డ్రైవర్ గా నిలిచాడు. 2016లో 18 ఏండ్ల వయసులో టైటిల్ గెలిచిన మ్యాక్స్ వెర్‌‌‌‌స్టాపెన్ ముందున్నాడు.  

పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెలి గంటా 33 నిమిషాల15.607 సెకండ్లలో పోడియం ఫినిష్ చేయగా.. అతని తోటి డ్రైవర్ జార్జ్ రస్సెల్ (+5.515 సె) రన్నరప్‌‌‌‌గా నిలిచాడు. ఫెరారీ రేసర్ లూయిస్ హామిల్టన్ (+25.267సె) మూడో స్థానం అందుకున్నాడు. ఇక ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన భద్రతా సమస్యల దృష్ట్యా ఏప్రిల్‌‌‌‌12, 19వ తేదీల్లో జరగాల్సిన బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రి రేసులను రద్దు చేశారు.