ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలి : ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలి : ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి
  • నేను సిద్ధం: ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ డ్రగ్​టెస్ట్​చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. డ్రగ్ టెస్ట్​కు తాను సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్‌‌‌‌తో నింపేశారని, ఏ ఫార్మా కంపెనీలో చూసినా డ్రగ్స్ కనిపిస్తున్నాయని ఆరోపించారు. 

డ్రగ్స్ మహమ్మారిపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారని, మూసీ పక్కనే ఆదిత్య కోటిరెడ్డి కడుతున్న అపార్ట్‌‌‌‌మెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.