తెలంగాణ దేశానికే ఆదర్శం: గవర్నర్ తమిళిసై

తెలంగాణ దేశానికే ఆదర్శం: గవర్నర్ తమిళిసై

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగురవేశారు గవర్నర్ తమిళిసై. సీఎం కేసీఆర్ , పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ తర్వాత సందేశమిచ్చారు గవర్నర్ తమిళిసై. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.