IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 221 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. దీంతో టార్గెట్ కోసం బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి 122 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు.
కార్తీక్ త్యాగి వేసిన 6వ ఓవర్ లాస్ట్ బాల్ కి 2 రెండు పరుగులు తీసుకుని జస్ట్ 23 బంతుల్లోనే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తన 50వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్ సైతం భారీ సిక్సులతో తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కేవలం 25 బాల్స్ లోనే 50 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తన బౌలర్లను మళ్లీ మళ్లీ మార్చినప్పటికీ వికెట్ ని తీసుకునే బౌలర్ మాత్రం ఇప్పటి వరకు కేకేఆర్ కి దొరకలేదు.
10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ జట్టు పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఉన్నారు. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు తలో రెండు ఓవర్లు వేయగా వైభవ్ అరోరా (24 పరుగులు), బ్లెస్సింగ్ ముజారబానీ (24 పరుగులు), వరుణ్ చక్రవర్తి (23 పరుగులు), కార్తీక్ త్యాగి (28 పరుగులు), సునీల్ నరైన్ (22 పరుగులు) ధారళంగా పరుగులు సమర్పించుకోవడంతో ముంబై విజయానికి మరో 99 బంతుల్లోనే 99 పరుగులు చేయాల్సి ఉంది.
Rohit Sharma in his element 🙌
— IndianPremierLeague (@IPL) March 29, 2026
🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW
