2026 మార్చి చివరి వీకెండ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రెండు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండింటిలో ఒకటి మలయాళంలో విడుదలై మంచి టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మరో సినిమా బాలీవుడ్ లో క్రైమ్ & థ్రిల్లర్ జానర్‌లో రూపొంది, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి కథేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam).
మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య విడుదలైన అంబిషీయస్ సైన్స్ ఫిక్షన్ సైబర్ పంక్ థ్రిల్లర్ ‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam).
ఆర్కే కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ తెరపై దుమ్మురేపుతోంది. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ‘మస్తిష్క మరణం’ చిత్రం మలయాళంలో ఒక సరికొత్త ప్రయోగంగా నిలిచింది. మార్చి 27, 2026 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీలో రజిషా విజయన్, నిరంజ్ మణియంపిళ్ల రాజు, జగదీష్, దివ్య ప్రభ, సురేష్ కృష్ణ, రాహుల్ రాజగోపాల్ , విష్ణు అగస్త్య ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు ఆర్కే కృష్ణన్ తనదైన శైలిలో ఫ్యూచరిస్టిక్ థ్రిల్లర్‌గా మలిచారు. వర్కీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. వినాయక అజిత్ భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథేంటంటే:
2046లో నియో కొచ్చి అనే ఫ్యూచరిస్టిక్ సిటీలో బిమల్ రాజ్ (నిరంజ్ మణియన్ పిళ్లై రాజు) అనే వ్యక్తి ఉంటాడు. అతను తన చిన్న కూతురి మరణం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడలేకపోతాడు. అతని భార్య ఆ జ్ఞాపకాలను మెడికల్ ప్రొసీజర్ ద్వారా తొలగించుకుంటుంది. కానీ, బిమల్ మాత్రం వర్చువల్ రియాలిటీ మెమరీ గేమ్స్ ద్వారా తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒకసారి ఆ గేమ్‌లో సూపర్‌స్టార్ ఫ్రిడా సోమన్ (రజీషా విజయన్) మెమరీని యాక్సెస్ చేయడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ మెమరీలో అతను ఫ్రిడాకు సంబంధించిన కొన్ని భయంకరమైన రహస్యాలు తెలుసుకుంటాడు. ఆమె చేసిన రెండు హత్యలకు ‘సాక్షి’ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా కథ.
‘మర్దానీ 3’ (Mardaani 3):
బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘మర్దానీ 3’ (Mardaani 3) . అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ‘మర్దానీ’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కింది. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ హిట్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల గ్రాస్, ఇండియాలో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంటోంది.
►ALSO READ | సినిమా చెడగొట్టారు.. డింపుల్ బ్లండర్ సెలక్షన్! NBK111 హీరోయిన్ ట్రోల్స్‌పై మీమ్‌తో మలినేని కౌంటర్!
ఇందులో డ్యూటీలో రాజీ పడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ ఇంప్రెస్ చేశారు. దేశంలో మిస్ అవుతున్న 93 మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. రాణీ ముఖర్జీని ఎదిరించే విలన్ రోల్‌లో నటి మల్లికా ప్రసాద్ కనిపించారు.‘సైతాన్’ ఫేమ్ జానకి బొడివాలా ‘కానిస్టేబుల్ ఫాతిమా అన్వర్’ అనే కీలక పాత్ర పోషించింది.
కథేంటంటే:
ఢిల్లీలో ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు బ్యూరోక్రాట్ కూతురు, సాధారణ కుటుంబానికి చెందిన మరొకరు కిడ్నాప్ అవుతారు. పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)కి పై అధికారులు ఆ కేసును అప్పగిస్తారు.శివాని మొదట్లో అది సాధారణ మిస్సింగ్ కేసు అనుకుంటుంది. లోతుగా వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న బెగ్గింగ్ మాఫియా, చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ బయటపడుతుంది. ఆ నెట్‌వర్క్‌ను నడిపేది అమ్మ (మల్లికా ప్రసాద్) అనే మహిళ. శివాని తన టీంతో 93 మంది అమ్మాయిలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. అందులో భాగంగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఆమ్మను ఎలా ఎదుర్కొంటుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
