సినిమా చెడగొట్టారు.. డింపుల్ బ్లండర్ సెలక్షన్! NBK111 హీరోయిన్ ట్రోల్స్‌పై మీమ్‌తో మలినేని కౌంటర్!

సినిమా చెడగొట్టారు.. డింపుల్ బ్లండర్ సెలక్షన్! NBK111 హీరోయిన్ ట్రోల్స్‌పై మీమ్‌తో మలినేని కౌంటర్!

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘NBK111’పై ఫిలింనగర్‌లో ఒక సంచలన వార్త చక్కర్లు కొట్టింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో డింపుల్ హయాతిని హీరోయిన్‌గా తీసుకున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే, ఈ ఊహాగానాలకు ఎండ్ కార్డ్ వేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. తనదైన స్టైల్లో స్పందిస్తూ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్ బాలకృష్ణ అభిమానులతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్‌ను కూడా ఆకర్షిస్తోంది.

బాలకృష్ణకు జోడిగా డింపుల్ హయాతి నటిస్తుందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ, ఇది సరైన ఎంపిక కాదని కొందరు విమర్శలు చేశారు. మరికొందరు అయితే ఆమె బదులుగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఈ కామెంట్స్ అన్నింటినీ గమనించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, ఆసక్తికరమైన విధంగా స్పందించారు. ఒక నెటిజన్ ఆయనను ట్యాగ్ చేస్తూ, “మంచి హైప్ ఉన్న సినిమాను ఎలా చెడగొట్టాలో NBK111 మేకర్స్‌ను చూసి నేర్చుకోవచ్చు. డింపుల్ హయాతిని హీరోయిన్‌గా తీసుకోవడం బ్లండర్ మిస్టేక్. ఆమె బదులు రవీనా టండన్ అయితే బాగుండేది” అంటూ కామెంట్ చేశారు.

►ALSO READ | Mrithyunjay OTT: ఓటీటీలోకి ట్విస్టులతో కట్టిపడేసిన క్రైమ్ మిస్టరీ.. ‘మృత్యుంజయ్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

దీనికి ప్రత్యక్షంగా స్పందించకుండా, మలినేని ఒక ఫన్నీ మీమ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో మహేష్ బాబు చెప్పిన “మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను ఎవరికీ చెప్పలేదండి” అనే డైలాగ్ వినిపిస్తుంది. ఈ మీమ్ ద్వారా, డింపుల్ హయాతిని హీరోయిన్‌గా తీసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

నయనతార ఎందుకు తప్పుకుంది?

ముందుగా ఈ చిత్రాన్ని ఒక భారీ హిస్టారికల్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. ఈ చారిత్రక నేపథ్యంలో బాలయ్య సరసన రాణి పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన నయనతార పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇటీవల 'అఖండ 2' ఫలితం,  ప్రస్తుత ఓటీటీ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చారిత్రక కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను మార్చేశారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ మార్పు విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ ఇబ్బందులు..

మరో వైపు ఈ సినిమా కోసం నయనతార దాదాపు రూ. 8 నుండి 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత పెద్ద మొత్తం నయనతారకు ఇచ్చే బదులు, రూ. 2 కోట్లలోపు వచ్చే మరో హీరోయిన్‌ను తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కథలో కీలక మార్పులు

ఈ సినిమా నుంచి నయనతారను తప్పించడమే కాదు.. పూర్తిగా సినిమా కథనే మార్చేసారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని మొదట అనుకున్న పీరియడ్ డ్రామా కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి, బాలయ్య మార్క్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో సినిమా రానుందని టాక్. ఈ మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, బాలయ్య మాస్ ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.