జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల దీక్షకు.. ఫుడ్ ప్యాకెట్లు వెల్లువెత్తుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గరకు వచ్చే మద్దతుదారులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో.. వేలాది మంది ముందుకు వచ్చారు. ఆన్ లైన్ డెలివరీలతోపాటు పార్శిల్స్ ద్వారా వేలాది ఫుడ్ ప్యాకెట్లు వస్తున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం ఇలా.. వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులు.. జంతర్ మంతర్ దగ్గరకు ఫుడ్ ప్యాకెట్లను పంపిస్తున్నారు. కొంత మంది 50, 100 మందికి అంటూ.. క్యాటరింగ్ సర్వీసులను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ దగ్గర వేలాది ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కనిపిస్తున్నాయి. అవసరానికి మించి ఆహారం వస్తుండటంతో.. అదంతా వేస్ట్ అవుతుందని.. ఎవరూ ఫుడ్ ప్యాకెట్లు, ఆహారం పంపించొద్దు అంటూ పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ.
Heartwarming scene at Jantar Mantar. ❤
— Desi Lord (@DesiLord_) July 21, 2026
Several anonymous supporters send Food to students present at Jantar Mantar through Swiggy and Zomato. pic.twitter.com/y0NYwv4Vja
నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ ఆరోపణలపై జవాబుదారీతనం కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన వినూత్నంగా మారింది. పరీక్షల్లో పారదర్శకత ఉండాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అభిజీత్ దీప్కే అనే వ్యక్తి నేతృత్వంలోని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) జూలై 20న జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఊహించని రేంజ్‌లో మద్దతు లభించింది. అయితే, ఈ మద్దతు పాదయాత్ర నిర్వాహకులకు ఒక కొత్త సవాలు తెచ్చిపెట్టింది.
ఫుడ్ ఆర్డర్ల క్యూ
నిరసన ప్రదేశానికి కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి నిరసనకారుల కోసం పంపించారు. దింతో డెలివరీ బాయ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తు ఫుడ్ తెచిస్తునే ఉన్నారు. మరికొందరు స్వయంగా వాళ్ళ ఇళ్లలో వండిన వంటకాలు, స్నాక్స్, టీ, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి నిరసనకారులకు అందించారు. వచ్చిన ఆహారాన్ని పంచిపెట్టడానికి వాలంటీర్లు రోజంతా కష్టపడాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల సమయానికి అక్కడున్న జనాభా కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఆహారం వచ్చి చేరింది.
ALSO READ : కాక్రోచ్ పార్టీ ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ..
Wow, people have sent so much food via Swiggy and Zomato for Students.
— Magadh Updates (@magadh_updates) July 22, 2026
No one imagined the countrymen would shower so much love. Anyway, good times are here for the restaurant owners. pic.twitter.com/uDjC5yz6sI
ఇక చాలు.. ఆహారం పంపకండి
సహాయం తీసుకోవడం కాకుండా, "ఇక మాకు ఫుడ్ డొనేషన్స్ పంపకండి" అని నిర్వాహకులు ప్రజలను కోరడం ఒక అరుదైన సంఘటనగా నిలిచింది. ఈ పరిస్థితిపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఎక్స్ ద్వారా "మన భారతదేశం ఎంత అందమైన దేశమో, ఇక్కడి ప్రజలు ఎంత మంచివారో.. నిరసనకారుల కోసం ఆహారం పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమకు మేము మురిసిపోతున్నాం. అయితే, ఈ రోజుకు మాకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఫుడ్ వచ్చేసింది. దయచేసి ఇకపై ఎం పంపకండి" అంటూ పోస్ట్ చేసింది:
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. విద్యార్థుల కోసం, నిరసనకారుల కోసం దేశ ప్రజలు చూపిన ఈ ఉదారత, సంఘీభావాన్ని అంతా కొనియాడారు.
India is such a beautiful country with such beautiful people - thanks for sending food for protesters. We are so overwhelmed.
— Cockroach is Back (@Cockroachisback) July 21, 2026
BUT for today, we have received more than enough food - please don’t send any more! pic.twitter.com/ZVQC89bWeb
