Food: వెరైటీ వంటకాలు.. క్యాబేజీ.. సొరకాయ పరాటాలు.. సూపర్ టేస్ట్

Food: వెరైటీ వంటకాలు.. క్యాబేజీ.. సొరకాయ పరాటాలు.. సూపర్ టేస్ట్

రొట్టెలు తినాలన్నా... పూరీలు తినాలన్నా.... నంజుకోవడానికి రుచికరమైన కూర ఉండాల్సిందే. అలాకాకుండా రొట్టెల్లోనేకూర పెట్టి చేస్తే... అదేపరాటా అవుతుంది. ఈపరాటాల్లోనూ వెరైటీలు చేసుకోవచ్చు. ఒక్కోసారిఒక్కోరకం స్టఫ్ ను  రొట్టెల్లో పెట్టి  తింటే రుచి అదిరిపోవాల్సిందే.  క్యాబేజీ, సొరకాయ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

క్యాబేజీ పరాటా తయారీకి కావాల్సినవి

  • క్యాబేజీ తరుగు-రెండు కప్పులు 
  • గోధుమపిండి- రెండుకప్పులు 
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • కారం- ఒక టీస్పూన్ 
  • నూనె లేదా నెయ్యి - సరిపడా
  • ఉప్పు- తగినంత

క్యాబేజీ పరాటాలు తయారీ విధానం 

క్యాబేజీ తరుగులో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాలి. అలాగే ఒక పెద్ద గిన్నెలో ముద్దగా కలపాలి. మరో గిన్నెలో క్యాబేజీ తరుగు గరం మసాలా, కొత్తమీర తరుగు, పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీల్లా వత్తాలి. వాటి మధ్యలో క్యాబేజీ మిశ్రమం పెట్టి గుండ్రంగా చేయాలి. మిశ్రమం బయటికి రాకుండా, మందంగా వత్తి నూనె లేదా నెయ్యితో పెనంపై కాల్చాలి అంతే ఘుమఘుములా డే క్యాబేజీ పరాటాలు రెడీ.

సొరకాయపరాటాలు తయారీకి కావలసినవి

  • సొరకాయ తురుము - ఒక కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
  • వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్
  • ఉప్పు- తగినంత 
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  •  కరివేపాకు - ఒక రెమ్మ 
  • నానబెట్టిన శెనగపప్పు- అర టేబుల్ స్పూన్
  •   ఉల్లిగడ్డ తరుగు - టేబుల్ స్పూన్ 
  • వాము- అర టీ స్పూన్
  •  గోధుమపిండి - ఒక కప్పు 
  • నూనె లేదా నెయ్యి- సరిపడా 

సొరకాయ పరాటా తయారీ విధానం

గోధుమపిండిలో ఉప్పు నెయ్యి లేదా నూనె.సరిపడా నీళ్లు పోసి ముద్దగా కలపాలి. ఒక గిన్నెలో సొరకాయ తురుము, పచ్చిమిర్చొ , వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, వాము, ఉప్పు, నానబెట్టిన శెనగపప్పు వేసి కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకొని చపాతీ ల్లా వత్తాలి. వాటి మధ్యలో సొరకాయ మిశ్రమం పెట్టి, గుండ్రంగా చేయాలి. వాటిని చపాతీ కర్ర లేదా చేతితో మందంగా వత్తాలి. చివరగా వాటిని పెనంపై నూనె లేదా నెయ్యితో కాల్చాలి. గోధుమపిండి వద్దనుకునే వాళ్లు బియ్య ప్పిండిలో సొరకాయ తురుముతో పాటు అన్ని పదార్దాలు వేసి రొట్టెల్లా వత్తి కాల్చుకోవాలి.  వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.