Big Boss Mega Launch: 'బిగ్ బాస్' చరిత్రలో తొలిసారి.. ఒకేసారి 6 భాషల్లో మెగా షో.. గంగూలీ గ్రాండ్ ఎంట్రీ!

Big Boss Mega Launch: 'బిగ్ బాస్' చరిత్రలో తొలిసారి.. ఒకేసారి 6 భాషల్లో మెగా షో.. గంగూలీ గ్రాండ్ ఎంట్రీ!

ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలటీ షో 'బిగ్ బాస్'. ఈ సారి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు భాషల వారీగా వేర్వేరు సమయాల్లో ప్రారంభమయ్యే ఈ షోను .. తొలిసారి ఒకేసారి 6 భాషాల్లో ఈ షోను ప్రసారం కానుంది. వాటిల్లో తెలుగు, హింధీ, తమిళం, కన్నడ, మలయాళం , బంగ్లా భాషల్లో ఒకే సారి ప్రారంభించేందుకు జియోహాట్ స్టార్ భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది,

 ఏకకాలంలో 6 భాషల్లో..

దీంతో ఇకపై భాషల వారీగా వేచి చూడాల్సిన పనిలేకుండా.. ఈ ఆరు భాషల 'బిగ్ బాస్ సీజన్లు' సెప్టెంబర్ నుంచి జియోస్టార్ నెట్‌వర్క్, జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఏకకాలంలో ఈ మెగా రియాలిటీ హంగామా మొదలుకానుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు మరోసారి అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా అలరించనున్నారు.

హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ 

హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ యథావిధిగా కొనసాగనున్నారు. అయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా బెంగాలీ బిగ్ బాస్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం విశేషం. 

'అగ్ని పరీక్ష' రెడీ..

తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే 9 విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన సీజన్-10లోకి అడుగుపెడుతోంది.'దశావతారం' థీమ్‌తో ఈ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.. కామనర్స్‌కు మరోసారి పెద్దపీట వేయబోతున్నారు. ఆగస్టులో ప్రారంభమయ్యే 'అగ్ని పరీక్ష' ద్వారా ఎంపికైన విజేతలు సెలబ్రిటీలతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి షో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇండియాస్ బిగ్ రియాలిటీ..

ఇక 'ఇండియాస్ బిగ్ రియాలిటీ' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక టేబుల్ బుక్‌లో జియోస్టార్ వెల్లడించిన గణాంకాలు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. 2025 నాటికి ఆరు భాషల్లో కలిపి బిగ్ బాస్‌కు 500 మిలియన్లకు పైగా ప్రేక్షకులు, 438 బిలియన్ వ్యూయింగ్ నిమిషాలు, 9.32 బిలియన్ ఓట్లు, 43 మిలియన్ లైవ్ చాట్ పాల్గొన్నారు. 1.7 బిలియన్ సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్లు, 30 మిలియన్లకు పైగా మీమ్స్ నమోదయ్యాయి. దక్షిణ భారతంలో ప్రతి 10 మంది టీవీ వీక్షకుల్లో 8 మంది బిగ్ బాస్‌ను వీక్షిస్తున్నారనే ఈ లెక్కలు ఈ షోపై ఉన్న క్రేజ్ ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈసారి ఏకకాలంలో ఆరు భాషల్లో ప్రారంభమవుతున్న ఈ మెగా సీజన్ భారత టెలివిజన్ చరిత్రలో మరో కొత్త మైలురాయిగా నిలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.