ట్రాన్స్‌కో డీఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ సిటీలో భార్య పేరు మీద 10 బిల్డింగులు !

ట్రాన్స్‌కో డీఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ సిటీలో భార్య పేరు మీద 10 బిల్డింగులు !

హైదరాబాద్: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీకి చెందిన 8 బృందాలు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశాయి. సోదాల్లో కీలక ఆస్తి పత్రాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ఈ తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 2019లో ముత్యం వెంకటరమణ 26 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, అప్పటినుంచి అతనిపై నిఘా ఉంచామని చెప్పారు. అతని నివాసంలో రెండో సారి ఏసీబీ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ముత్యం వెంకట రమణ భార్య స్వప్న పేరుపై నిర్మాణ రంగంలో 10 ఫ్లాట్స్ గుర్తించామని చెప్పారు. ఆంజనేయ నగర్, మూసా పేట్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు.

ఆంజనేయ నగర్,  మూసాపేట్ లో నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్స్..G+3  కమర్షియల్ భవనాలు, ఖానామెట్ గుట్టల బేగం పేట్లో G+5 కమర్షియల్ బిల్డింగ్ గుర్తించామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. నగదు, పత్రాలు, గోల్డ్ అండ్ డైమండ్ జూలరీ, ఫారిన్ లిక్కర్ గుర్తించామని, దాని విలువ లెక్కిస్తామని వివరించారు.

ALSO READ : బ్రిటీషోళ్లను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్.. మీరెంత

ప్రస్తుతం ముత్యం వెంకట రమణ డిప్యూటీషన్పై రెడ్ కోలో ఉన్నారని, ఈయన 56 ఏళ్ల వయసులో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ శాఖలో పని చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని, కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన మూడు ఫోర్ వీలర్ వాహనాలు గుర్తించామని.. వీటి విలువ లెక్కించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తనిఖీలపై ఏసీబీ అధికారులు చెప్పారు.