సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెలవు రోజున సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం ( మార్చి 29 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లాలోని కొడకండ్ల శివారులో ఉన్న మల్లన్న సాగర్ కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
కొడకండ్లకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రిషిక, 6వ తరగతి చదువుతున్న మనీష్ లు ఆదివారం కావడంతో మల్లన్న సాగర్ లో ఈతకు వెళ్ళి మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొర్రెల దాహార్తిని తీర్చేందు కు వెళ్లిన ఇద్దరు గొర్రెల కాపర్లు నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గొర్రెలకు హార్తిని, స్నానం చేయించేందుకు సమీపంలోని చెరువు వద్దకు ముడికె లక్ష్మిరాజం, కుమ్మం మొండయ్య ఇద్దరు గొర్రెల కాపరులు తమ గొర్రెల మందతో కలిసి గ్రామం శివారులోని చెరుపు వద్దకు వెళ్లారు.
గొర్రెలను నీటిలోకి దింపి స్నానం చేయిస్తున్న క్రమంలో, వారు అదు పుతప్పి నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లారు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. వెంటనే కొనరావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తుల సహాయంతో మృతదేహాల ను బయటకు తీశారు. ఈ ఘటనతో ధర్మారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
