యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం: ప్రధాని మోడీ

యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం: ప్రధాని మోడీ
  • సవాళ్లును ధీటుగా ఎదుర్కొంటున్నం
  • కోవిడ్ తర్వాత కల్లోలంగా మార్చి నెల
  • తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ వ్యాపంగా ఇందన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం జరు గుతున్న ప్రాంతం అంతర్జాతీయ ఇంధన అవసరాలకు కేంద్రబిందువని చెప్పారు. దీని వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడం కారణంగా పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెరిగే ముప్పు ఉందని మోదీ అభిప్రాయ పడ్డారు. మన్ కీబాత్ 132వ కార్యక్రమం లోభాగంగా ప్రధాని మోదీ ఇవాళదేశప్ర జలను ఉద్దేశించి మాట్లాడారు. 

అయితే దశాబ్ద కాలంగా భారత్ నిర్మించుకున్న అంతర్జాతీయ సంబంధాల వల్ల ఇంధన సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నా మని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి నెల అంతర్జాతీయంగా అత్యంత కల్లోలభరితంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచం కోలుకుంటుందని ఆశించిన తరుణంలో ఈ యుద్ధాలు మొదలవ్వడం దురదృష్టక రమని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలపై ప్రభావం పడిందని మోదీ అన్నారు. 

►ALSO READ | ఇంటర్ మినిస్ట్రియల్ ముందు ‘మామునూరు’ ఎయిర్‌‌ పోర్టు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అక్కడ ఉన్న భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా
ఈ అంశంపై ఎవరూ రాజకీయం చేయ వద్దని మోదీ కోరారు. 140 కోట్ల భారతీ యుల ప్రయోజనాలే ముఖ్యమని, స్వార్ధ రాజకీయాలకు ఇది సమయం కాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం. పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కేవలం ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు.