తొలిసారిగా రూ.20 కాయిన్ విడుదల

తొలిసారిగా రూ.20 కాయిన్ విడుదల

దేశ కరెన్సీలోనే తొలిసారిగా రూ.20 కాయిన్ విడుదల చేసింది కేంద్రం. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ , కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్ సంయుక్తంగా మొదటిసారిగా తయారుచేసిన 20 కాయిన్ తో పాటు… 10, 5, 2, 1 రూపాయల నాణేలను విడుదల చేశారు. అంధ విద్యార్థులు పాల్గొన్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ కాయిన్స్ ను ప్రధాని ఆవిష్కరించారు. 

ఇప్పటివరకు ఉన్న కాయిన్ తో పోల్చితే ఈ 20 రూపాయల కాయిన్ డిఫరెంట్ గా ఉంది.

  • కాయిన్ వ్యాసం 27మి.మీ.
  • బరువు 8.54 గ్రాములు
  • 12 అంచుల కాయిన్
  • కొత్త నాణెం చివర్లలో ఎలాంటి డిజైన్‌ ఉండదు
  • రూ. 10 నాణెంలాగే.. రూ. 20 నాణెంలోనూ రెండు రింగ్స్‌
  • వెలుపలి రింగ్‌ను 65శాతం రాగి, 15శాతం జింక్‌, 20శాతం నికెల్‌తో తయారు చేశారు
  • లోపలి రింగ్‌ను 75శాతం కాపర్‌, 20శాతం జింక్‌, 5శాతం నికెల్‌తో తయారీ

త్వరలోనే ఈ కొత్త 20 రూపాయల కాయిన్ తోపాటు.. మిగతా కాయిన్స్ ను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది.