ఫిఫ్త్ ఫేజ్‌లో ఓటేసిన ప్రముఖులు: అక్షయ్ కుమార్, జాన్వీ, మాయావతి, ఇంకా..

ఫిఫ్త్ ఫేజ్‌లో ఓటేసిన ప్రముఖులు: అక్షయ్ కుమార్, జాన్వీ, మాయావతి, ఇంకా..

లోక్ సభ ఐదవ దశ ఎన్నికలు సోమవారం జరుతున్నాయి. ఈ  ఎన్నికల్లో 49 పార్లమెంట్ స్థానాలకు 695మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన గంటలోనే కొందరు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ ముంభైలో  ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అక్షయ్ కుమార్ కూడా క్యూలైన్ లో నిలబడి ముంభైలో  ఆయన ఓటు వేశారు. రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అతిథి సింగ్ ఆమె ఓటు హక్కు వినియోగించుకుంది. 

ముంభై నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బహుజన్ సమాజ్ వాదీ అధ్యక్షురాలు మాయవతి  ఉదయాన్నే లక్నోలో ఓటు వేశారు.

ఎనిమిది రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ఈరోజు జరుగుతుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్ లో 7, ఒడిశాలో5 బిహార్​లో ఐదు, జార్ఖండ్​లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్​లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9గంటల వరకు 10.28 ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు అయ్యిందని పోలింగ్ అధికారులు తెలిపారు.