క్యూ4 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతం

క్యూ4 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతం

2023-24 లో 7 శాతం: ఇండియా రేటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతంగా  ఉంటుందని,  2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను   6.9 శాతం నుంచి 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఇండియా రేటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా అంచనా వేశారు.  ఇండియా జీడీపీ నెంబర్లు ఈ నెల 31 న విడుదల కానున్నాయి. కిందటి ఆర్థిక  సంవత్సరంలోని జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీడీపీ గ్రోత్ రేట్ 8.2 శాతంగా, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.1 శాతంగా, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.4 శాతంగా రికార్డయ్యింది.

లో బేస్ ఉండడంతో  2023–24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు క్వార్టర్లలో జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు ఎక్కువగా రికార్డయ్యిందని, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.4 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగించిందని సునీల్ అన్నారు. ట్యాక్స్ కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడంతో మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీడీపీ గ్రోత్ రేటు ఎక్కువగా నమోదయ్యిందని, నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ కాకపోవచ్చని ఆయన అంచనా వేశారు. గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీవీఏ) గ్రోత్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.5 శాతం ఉంటే, జీడీపీ గ్రోత్ రేట్ 8.4 శాతంగా రికార్డయ్యింది.  ట్యాక్స్ వసూళ్లు పెరగడంతో ఈ తేడా కనిపించింది. అదే  కిందటి ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జీవీఏ, జీడీపీ గ్రోత్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.2 శాతం దగ్గరే ఉన్నాయి. రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవీఏ గ్రోత్ రేట్ 7.7 శాతంగా, జీడీపీ గ్రోత్ రేట్ 8.1 శాతంగా రికార్డయ్యింది.