రూ.28,200 కోట్లు అమ్మిన ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు

రూ.28,200 కోట్లు అమ్మిన ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు

న్యూఢిల్లీ: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐ)  ఈ  నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.28,200 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు చైనీస్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు చౌకగా ఉండడంతో మన మార్కెట్ల నుంచి ఫండ్స్ వెనక్కి తీసేసుకుంటున్నారు. 

కిందటి నెలలో నికరంగా రూ.8,700 కోట్ల విలువైన షేర్లను  ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు అమ్మారు. అంతకు ముందు నెలలో నికరంగా రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో నికరంగా రూ.1,539 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.