ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నడిపేది గ్లోబల్ అంశాలే

ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ను నడిపేది గ్లోబల్ అంశాలే
  • ముంబైలో ఎలక్షన్స్ ఉండడంతో నేడు సెలవు

ముంబై: ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను కంపెనీల మార్చి క్వార్టర్ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ అంశాలు, విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల కదలికలు నిర్ణయించనున్నాయి. ఎలక్షన్ సీజన్ కావడంతో వోలటాలిటీ  కొనసాగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, లోక్‌‌‌‌‌‌‌‌ సభ ఎన్నికల్లో ఐదో దశ సోమవారం జరగనుంది. ముంబైలో ఎన్నికలు ఉండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సెలవు. ‘క్యూ4 ఎర్నింగ్స్ సీజన్‌‌‌‌‌‌‌‌లో చివరి దశలో ఉన్నాం. 

రిజల్ట్స్ మెరుగ్గా ఉంటే ప్రస్తుత అనిశ్చితి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  కొంత ఉపశమనం దొరకొచ్చు’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ ప్రవేష్ గౌర్ అన్నారు. యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్‌‌‌‌‌‌‌‌ పావెల్‌‌‌‌‌‌‌‌ సోమవారం స్పీచ్ ఇవ్వనున్నారని, మార్కెట్‌‌‌‌‌‌‌‌పై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు జపాన్‌‌‌‌‌‌‌‌, యూఎస్ ఎకనామికట్ డేటా, డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – రూపాయి ట్రెండ్‌‌‌‌‌‌‌‌, క్రూడాయిల్ ధరల్లో కదలికలు మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయిస్తాయని అన్నారు.  ఈ వారం ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ, సెయిల్‌‌‌‌‌‌‌‌, భెల్‌‌‌‌‌‌‌‌, జేకే టైర్, వన్‌‌‌‌‌‌‌‌97 కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌, పవర్ గ్రిడ్‌‌‌‌‌‌‌‌, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్లోబ్‌‌‌‌‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌‌‌‌‌, ఐటీసీ, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ తమ మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి.