మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు మాదిరిగా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2026, జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‎గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. బోర్డు డైరెక్టర్‎లుగా 15 మందిని నియమించారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో ఎండోమెంట్ ఆఫీసర్ వీరాస్వామి శనివారం (జనవరి 17) ప్రమాణం చేయించారు. 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర 2026, జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 31 వరకు సాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి జాతరను ప్రారంభించనున్నారు. వన దేవతలను దర్శించుకునేందుకు దేశ నలుమూలల భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ALSO READ : కార్పొరేషన్, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు