తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 మంది IPS అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు శనివారం (జనవరి 17) సాయంత్రం ఉత్తర్వులు జారీ శారు.
- డా. గజరావు భూపాల్ (IPS 2008) సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయ్యి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్‌గా నియామితులయ్యారు. ఆయనకు అదనంగా IG – స్పోర్ట్స్ & వెల్ఫేర్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
- అభిషేక్ మొహంతీ (IPS 2011) నార్కోటిక్స్ బ్యూరో DIG నుంచి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ DIG గా బదిలీ అయ్యారు.
- ఆర్. భాస్కరన్ (IPS 2012) CI సెల్ SP నుంచి DIG, CI సెల్ – ఇంటెలిజెన్స్కు ట్రాన్స్ఫర్ అయ్యారు.
- జి. చందనా దీప్తి (IPS 2012) రైల్వేస్ SP/DIG నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ (అడ్మిన్ & ట్రాఫిక్)గా బదిలీ అయ్యారు.
- టి. అన్నపూర్ణ (IPS 2013) విజిలెన్స్ SP నుంచి సైబరాబాద్ DCP (అడ్మిన్)
- బి.కే. రాహుల్ హెగ్డే (IPS 2014) హైదరాబాద్ ట్రాఫిక్ DCP నుంచి ట్రాఫిక్–III DCP
- కె. అపూర్వా రావు (IPS 2014) ఈస్ట్ జోన్ DCP నుంచి ఇంటెలిజెన్స్ SP
- బాల స్వామి (IPS 2018) ఈస్ట్ జోన్ DCP నుంచి విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ SP
- ఆర్. వెంకటేశ్వర్లు (IPS 2018) ట్రాఫిక్–III DCP నుంచి CID SP
- ఎస్. చైతన్య కుమార్ (IPS 2020) సౌత్ ఈస్ట్ జోన్ DCP నుంచి క్రైమ్స్ DCP, హైదరాబాద్
- అవినాష్ కుమార్ (IPS 2021) అడిషనల్ SP (ఆపరేషన్స్), కొత్తగూడెం నుంచి ట్రాఫిక్–I DCP, హైదరాబాద్
- కాజల్ (IPS 2021) ఉట్నూర్ ASP నుంచి ట్రాఫిక్–II DCP, హైదరాబాద్
- శేషాద్రిని రెడ్డి (IPS 2021) జగిత్యాల అడిషనల్ SP నుంచి ట్రాఫిక్–II DCP, సైబరాబాద్
- కంకనాల రాహుల్ రెడ్డి (IPS 2021) భువనగిరి ASP నుంచి ట్రాఫిక్–I DCP, మల్కాజ్‌గిరి
- శివమ్ ఉపాధ్యాయ (IPS 2021) ములుగు అడిషనల్ SP నుంచి ట్రాఫిక్ DCP, ఫ్యూచర్ సిటీ
అదే విధంగా శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలను కీలక స్థానాలకు బదిలీ చేసింది ప్రభుత్వం.
