ముంబైలో ఊహించని ట్విస్ట్ : 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్స్ కు తరలించిన ఏక్ నాథ్ షిండే..

ముంబైలో ఊహించని ట్విస్ట్ : 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్స్ కు తరలించిన ఏక్ నాథ్ షిండే..

ముంబై కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే పార్టీ శివసేన మెజార్టీ సాధించింది. ముంబై మేయర్ గా ఈ అలయన్స్ పార్టీకే దక్కుతుంది. ఫలితాలు వచ్చిన ఒక్క రోజు తర్వాత.. ముంబైలో ఊహించని పరిణామాలు జరిగాయి. UBT (ఉద్దవ్ బాలసాహెబ్ థాక్రే) ఉద్దవ్ థాక్రే చేసిన కామెంట్లతో షిండే అప్రమత్తం అయ్యారు. ముంబై పీఠంపై UBT అభ్యర్థిని కూర్చోబెట్టండి.. ఆ అవకాశం మళ్లీ ఇవ్వండి అంటూ చేసిన కామెంట్లతో.. షిండే వర్గం శివసేన పార్టీ అప్రమత్తం అయ్యింది. శివసేన పార్టీ నుంచి గెలిచిన 29 మంది కార్పొరేటర్లను ఓ ఫైర్ స్టార్ హోటల్ కు తరలించారు షిండే.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, షిండే సేన టికెట్‌పై ఎన్నికైన 29 మంది కార్పొరేటర్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌కు చేరుకుని, మూడు రోజుల పాటు అక్కడే ఉండాలని ఆదేశించారు.

ALSO READ : హెల్త్ ఆఫీసర్ల ఇన్సెంటివ్స్ పై కకృతి..

ఇతర పార్టీలు మా కార్పొరేటర్లను ప్రలోభపెట్టకుండా లేదా అమ్ముడుపోకుండా ఉండేందుకే షిండే ఈ విధంగా జాగ్రత్త పడ్డారు. వచ్చే మూడు రోజుల పాటు వీరంతా అక్కడే ఉండాలని ఆయన ఆదేశించారు. బిజెపితో కలిసి ముంబై పాలనను దక్కించుకోవడంలో ఈ 29 మంది చాలా కీలకం. దింతో రిసార్ట్ పాలిటిక్స్ మళ్ళీ  మొదలయ్యాయి. 

మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులను హోటళ్లలో దాచడం ఇదేం కొత్త కాదు. 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు సొంత ఎమ్మెల్యేలను ఇలాగే హోటళ్లలో ఉంచాయి. 2022లో శివసేన రెండుగా విడిపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించారు.

షిండే ఎవరికి భయపడుతున్నారు? సొంత వాళ్లనే నమ్మలేకపోతున్నారా?" అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. బిజెపి మిత్రపక్షాలను బలహీనపరుస్తుందని వారు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం ఎక్కువగా ఉందని థాకరే విమర్శించారు. మా పార్టీకి తగినంత బలం లేనందున ప్రస్తుతానికి మేయర్ పదవి దక్కకపోవచ్చని ఆయన అంగీకరించారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, 227 వార్డులలో 89 గెలుచుకుంది అలాగే 2017లో 82 సీట్లను అధిగమించింది. షిండే నేతృత్వంలోని శివసేన 29 సీట్లను జోడించి, మహాయుతి కూటమి సీట్ల సంఖ్యను 118కి చేర్చింది, ఈ మొత్తం సగం మార్కును సులభంగా మించిపోయింది. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ 24 స్థానాలను, AIMIM ఎనిమిది స్థానాలను, ఉద్ధవ్ సేన-MNS-NCP (SP) కలిసి 72 స్థానాలను గెలుచుకుంది.