ఒడిశాలోని అంగుల్ జిల్లా, కనిహా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుమంత కుమార్ పటేల్ శుక్రవారం విజిలెన్స్ అధికారులకు చిక్కారు. రూ. 49వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
సమాచారం ప్రకారం ... నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకం కింద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (CHO) నెలకు రూ. 15వేల వరకు ఇన్సెంటివ్స్ వస్తాయి. ఈ నిధులు విడుదల చేయడానికి డాక్టర్ పటేల్ ఒక్కో అధికారి నుండి రూ. 3వేలు లంచం డిమాండ్ చేశారు. దింతో విసిగిపోయిన 16 మంది హెల్త్ ఆఫీసర్లు కలిసి విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. అందరూ కలిసి డబ్బులు డాక్టరుకు ఇస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
