మౌనీ అమావాస్యను మాఘీ అమావాస్య అని కూడా అంటారు. భారతీయ సంప్రదాయంలో ఈ అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్ర పరంగానూ ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది ( 2026) మౌని అమావాస్యరోజు ( 2026 జనవరి 18) ఆరుగ్రహాలు (సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు, కుజుడు, బుధుడు) మకరరాశిలో.. శని ఆధీనంలోకి రానున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీటి ప్రభావం 12 రాశుల వారిపై అధికంగా ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు 2026 జనవరి మౌని అమావాస్ రోజును బిగ్ డే అంటున్నారు. మరి ఆరోజు ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో అంచనా వేశారు.. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. . .
మేషరాశి : ఈ రాశి వారు ఒత్తిడికి గురవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని చెడు సంఘటలను విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోనందుకు పశ్చాత్తాప్పడతారు. కొన్ని విషయాల్లో పోరాటం చేయాల్సిన అవసరం లేదరి లైట్‌గా తీసుకొని.. అప్పటి ఎంతో నిబద్దతగా..శ్రద్దగా స్పీడుగా సిన పనుల్లో ఒక్కసారిగా వేగం తగ్గుతుంది. అలా ఎందుకు తగ్గిందో తెలియన ఆందోళన చెందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఆ పని చేయడం వలన హాని కలుగుతుందని తెలిసినా.. వదిలేయడాని భయపడే అవకాశాలున్నాయి. ఏది జరిగితే అది జరిగిందని మధ్యలో పనులను ఆపేస్తారు. కొన్ని నమ్మకాల విషయంలో పట్టు విడుపును కోల్పోతారు. అనవసరంగా మాససికంగా ఆందోళన చెందుతారు. ఏదో చేయకూడని పని చేశామని అది ఏమిటో తెలియని స్థితిలో గడుపుతారు.
మిథున రాశి: ప్రతి విషయాన్ని చాలా సైలంట్ గా ఆలోచిస్తారు. గతంలో ఆగిపోయిన వాటిని తిరిగి ఎలా ప్రారంభించాలో తెలియక మదనపడుతుంటారు. మనస్సు చంచలంగా.. ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటుంది. చాలా అలసిపోయినట్లు.. విశ్రాంతి కావాలని కోరుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున పాత ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే బాధపడతారు. ఆ సమయంలో అలా చేయకపోతే బాగుండేదేమో.. ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కొన్ని సమస్యలకు పరిష్కరమార్గం లభించిదని భావిస్తారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు క్షమాగుణంతో నిదానంగా తేరుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహ రాశి : ప్రతి విషయాన్ని దూర దృష్టితో ఆలోచిస్తారు. గతంలో సాయం చేసిన వారికి గుర్తు చేసుకుంటారు. చేసే పనిలో శ్రద్ద లోపిస్తుంది. నాకేం కాదులే అన్న ధోరణితో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు పడతారు. నిదానంగా ఆలోచించండి అంతా మంచే జరుగుతుంది.
కన్య రాశి : గతంలో చేసిన పనులతో విసిగిపోతారు. ఏపని పూర్తికాకపోవడంతో ఎక్కువుగా ఆలోచిస్తుంటారు. తీసుకొనే కఠిన నిర్ణయాలతో ఇప్పుడు ఇబ్బంది కలిగినా ఫ్యూచర్ లో చాలా సంతృప్తినిస్తాయి.
తులా రాశి : మీరు చేస్తున్న పనిని ఇతరులు వ్యతిరేకిస్తారు. అయినా వారు మీ దారిలోక తప్పదు. ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతకు నిజాయితీగా సాయం చేస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వృశ్చిక రాశి : ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోరు. శారీరక బాధలు కలుగుతాయి. మీకు అండగా ఉన్నవారే కారణం లేకుండా మిమ్మలను వ్యతిరేకిస్తారు.
ధనుస్సు రాశి: ప్రతి పని విషయంలో స్వేచ్చను కోరుకుంటారు. చాలా ఆవేశంగా ఉద్వేగపడతారు. ఇతరులకు సాయం చేసేందుకు ఆశక్తి కనపరుస్తారు. ఇతరుల పాయం తీసుకొనేందుకు ఇష్టడరని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
మకర రాశి : జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చుకొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇతరుల సలహాలను గుడ్డిగా నమ్మొద్దు. విశ్రాంతి కోసం పరితపిస్తారు. ఆలోచనలు మనశ్శాంతి లేకుండాచేస్తాయి.
కుంభ రాశి : భావోద్వేగాలు గజిబిజిగా ఉంటాయి. వాటినుంచి బయటపడేందుకు కష్టపడతారు. ఎవరూ అవసరంలేదని భావిస్తారు. అలానే పనులు చేసుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను పునరాలోచిస్తారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం గురించి ఆలోచిస్తారు.
మీన రాశి : వాస్తవాలు కష్టంగా అనిపిస్తాయి, ఆలోచనలు స్థిరంగా ఉండవు. గతంలో చేసిన తప్పులకు ఇతరులను క్షమాపణలు అడుగుతారు. చేసే పనుల విషయంలో శ్రద్ద పెడతారు కాని పూర్తి కావు. జరుగుతున్న జాప్యం గురించి ఆలోచిస్తూ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంతో మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులుచెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
