నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో కంపెనీ లిస్టింగ్ అయిన సందర్భంగా క్లీన్‌మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రత్యేకంగా నిలిచింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కుల్దీప్ జైన్ సాధారణ దుస్తులకు బదులుగా 600 మంది ఉద్యోగుల ఫొటోలతో ముద్రించిన వినూత్న బెల్ సూట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. లిస్టింగ్ సెలబ్రేషన్స్‌లో స్టేజీపై మొత్తం టీంను ఒకేసారి తీసుకెళ్లినట్లుగా కనిపించేలా రూపొందించిన ఈ సూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సూట్ వీడియోలు,ఫొటోలను క్లీన్ మ్యాక్స్ కంపెనీ చీఫ్ పీపుల్ అండ్ కల్చర్ఆఫీసర్ శ్వేతా సజ్నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీఈవో కుల్దీప్ వేసుకున్న బెల్ సూట్ లో కంపెనీ మొత్తం ఉద్యోగుల ఫొటోలను ముద్రించారు. ఈ వినూత్న ఆలోచనకు తెరవెనక కథకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
ఈ ప్రత్యేక సూట్ తయారీ కోసం డిజైనర్లు, టైలర్లను ప్రత్యేకంగా నియమించారు. ప్రతి ఉద్యోగి ఫొటోను సేకరించి, వాటిని సూట్ మొత్తం సమతుల్యంగా ముద్రించేలా ప్రత్యేక డిజైన్ చేశారు. బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్‌ల నుంచి వ్యక్తిగత ఫోటో షూట్‌లు, తుది కుట్టు ప్రక్రియ వరకు జరిగిన ప్రయాణాన్ని వీడియోలో చూపించారు.ఈ వినూత్న ఆలోచన కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పట్ల మేనేజ్‌మెంట్ గౌరవం, అభిమానానికి ఉదాహరణగా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్పూర్తిదాయకంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
మనం చూస్తున్న ఈ వినూత్న బెల్ సూట్ ను తయారు చేసేందుకు స్పెషల్ గా డిజైనర్లు, టైలర్లను నియమించారు.ప్రతి ఉద్యోగి ఫొటోను సేకరించి సూట్ మొత్తం ఆ ఫొటోలతో ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం మీదం ఎంతో శ్రమించి ప్రత్యేక ప్రణాళికతో ఈ బెల్ సూట్ ను తయారు చేయించాని శ్వేతా సజ్నాని చెప్పారు. ఈ స్పెషల్ జాకెట్ ను సిద్ధం చేసేందుకు బ్రెయిన్‌స్టామింగ్ సెషన్‌లు ,వ్యక్తిగత ఫోటో షూట్‌ల నుంచి తుది కుట్టు ప్రక్రియ వరకు మొత్తం ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు.
►ALSO READ | రష్యా వైపు భారత్ చూపు..క్రూడ్ ఆయిల్ దిగుమతికి యత్నం
ఈ స్పెషల్ సూట్ కు సంబంధించిన పొటోలు వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లను బాగా ఆకర్షించాయి. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో ఉద్యోగులపట్ల కంపెనీమేనేజ్ మెంట్ ప్రత్యేక దృష్టికి ఓ ఉదాహరణగా నెటిజన్లుచెబుతున్నారు. ఈ వినూత్నమైన ఆలోచననను స్పందింపజేసేదిగా, స్పూర్తిదాయకంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
ఉద్యోగులే సంస్థకు అసలైన బలం అన్న మేసేజ్ ప్రపంచానికి తెలియజేస్తూ, క్లీన్‌మ్యాక్స్ సీఈవో కుల్దీప్ జైన్ 600 మంది సిబ్బంది ఫొటోలతో రూపొందించిన ప్రత్యేక బెల్ సూట్ ధరించి NSE అరంగేట్రాన్ని కంపెనీ చరిత్రలో గుర్తుండిపోయేలా చేశారు.
