ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మార్చి 3 వతేది ఏర్పడుతుంది. అయితే గ్రహణం ముగిసిన తరువాత కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈసమయంలో మంత్రాలకు చాలా పవర్ ఉంటుంది. అందుకే మంత్రశక్తిని వృద్ది చేసుకోవాలనుకునేవారు ఆచారాలు..ఉన్న వారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తారు. అయితే గ్రహణం వీడిన తరువాత కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఎందుకు పాటించాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి. గ్రహణం వీడిన తరువాత ఏం చేయాలి.. చేయకపోతే ఏం జరుగుతుంది. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు. ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు. ఇంట్లోనే ఉంటారు. మంత్రబలం ఉన్న వారు.. అనుష్టానం చేసుకుంటారు. ఈ సమయంలో చేసే అనుష్టానికి మిగిలిన రోజుల్లో చేసిన దాని కంటే వేలరెట్లు అధికంగా ఫలితం ఉంటుందని చెబుతుంటారు. ఉదాహరణకు మనము ఇమ్యూనిటి పవర్ పెంచుకొనేందుకు పండ్లు తీసుకుంటాం కదా.. అలానే మంత్రబలం శక్తిని పెంచుకొనేందుకు గ్రహణాల సమయంలో అనుష్టానం ద్వారా వృద్ది చెందుతుంది.
గ్రహణం సూతకాలం ప్రారంభమైన దగ్గరి నుంచి . .. దేవుడి విగ్రహాలను .. దేవుడి పటాలను ఎట్టి పరిస్థితిలోతాకకూడదు. అందుకే దేవాలయాలు కూడా మూసేస్తారు. జ్యోతిష్యం ప్రకారం మార్చి 3న కేతు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కేతువు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహణ సమయంలో కేతువు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు విశ్వమంతటా చాలా బలంగా ఉండి... భూమి పై ఉన్న వస్తువులపై.. జీవరాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
గ్రహణం వీడిన తరువా వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతున్నారు. వీటిని అనుసరించడం ద్వారా, ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు.
గ్రహణం తర్వాత ఇలా చేయండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతకాలం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లాలి. గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే, ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదు అని చెబుతుంటారు. దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణం ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
గ్రహణం తర్వాత స్నానం చేయండి...
మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది. గ్రహణం తర్వాత స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత గంగాజలం చల్లాలి. ఆ తరువాత ఆహార పదార్థాలపై అంటే నిల్వ పచ్చళ్లపై.. గంగాజలం చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
గ్రహణం కంటె ముందు సమయంలో తయారుచేసిన ఆహారాన్ని ( అన్నం .. రోజువారి కూరలు) పూర్తిగా పారవేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్ధాలను తినడం ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని పండితులు చెబుతారు. చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి.గ్రహణం ముగిశాక వెంటనే తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి.
నియమాలు పాటించకపోతే ఏమవుతుంది.
శక్తి కలిగిన వస్తువులను ముట్టుకుంటే తట్టుకోలేం కదా.. ఉదాహరణకు అగ్నిదేవునికి చాలా శక్తి ఉంటుంది. ఆ దేవునికి ఆగ్రహం వస్తే వేడికి తట్టుకోలేం కదా.. వేడి అంటే ఆయన పవర్ కదా..! అప్పుడు నీళ్లతో అగ్నిని శాంతింపచేస్తాం కదా.. అందుకే గ్రహణం వీడిన తరువాత స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.
కేతు గ్రస్త చంద్ర గ్రహణం సమయంలో కేతువు బల ప్రదర్శన చేస్తాడు. ఆయన విషాన్ని భూమిపై వ్యాపించేలా చేస్తాడు. ఆ సమయంలో మనం కూడా పవర్ పెంచు కోవాలి కదా.. అందుకే ధ్యానం.. జపాలు చేయాలి. ఇలా చేయడం వలన కేతువు ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. ఆ సమయంలో చాలా శక్తి కలిగి ఉంటాం. నిల్వ పచ్చళ్లు.. ఇంటిపై ఆయన ప్రభావం పడకుండా దర్భలు ఉంచుతాం.. అవి కేతువు ప్రభావాన్ని అడ్డుకుంటాయి.
ఇళ్లు ఎందుకు నీళ్లతో శుద్ది చేయాలి..
ఇంటిపైన ఉంచే దర్భలు ఎంత అడ్డుకున్నా కొంత ప్రభావం ఉంటుంది. అది ఏమీ చేయకపోయినా అక్కడే ఉంటే నష్టం కలుగుతుంది కదా.! అందుకే గ్రహణం వీడిన తరువాత నీళ్లతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాహనాలపై పసుపు నీళ్లు చల్లాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
